Jaya lalita warns upa govt

jaya lalita, tamilnadu govt, upa govt. kachateevu agreement 1974, srilanka navy attack on fishermen

jaya lalita warns upa govt

jaya-lalita.png

Posted: 03/26/2013 03:14 PM IST
Jaya lalita warns upa govt

jaya-lalita-photo1974 లో జరిగిన ఒప్పందం ప్రకారం శ్రీలంకకు ధారాదత్తం చేసిన కచ్చాతీవు ఒప్పందాన్ని దౌత్యపరంగా రద్దు చేసి దీవిని తిరిగి తీసుకోవాలని తమిళనాడు జయలలిత ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. శ్రీలంక నేవీ అధికారులు నిరంతరంగా తమిళనాడు మత్స్యకారులను వేధిస్తున్న సందర్భంగా జయలలిత కేంద్రాన్ని ఈ విధంగా కోరారు. యుపిఏ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైన పక్షంలో దీన్ని న్యాయపరంగా పరిష్కరిస్తామంటూ జయలలిత శాసన సభలో ప్రకటించారు. ఇలా దారుణ కాండ కొనసాగుతుంటే చోద్యం చూస్తూ ఊరుకోవటానికి తమిళనాడు మత్స్యకారులేమైనా విదేశీయులనుకుంటుందేమే కేంద్ర ప్రభుత్వం అని కూడా ఆమె విమర్శించారు.

1974 లో జరిగిన ఒప్పందం ప్రకారం అందులోని ఎన్నో విషయాలను శ్రీలంక ప్రభుత్వం పాటించవలసి ఉంది. అందులో ఆచారంగా వస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు అవేమీ పాటించటం లేదు. మత్స్యకారుల మీద శ్రీలంక నేవీవాళ్ళు తెగబడ్డప్పుడల్లా తను కేంద్రానికి తెలియజేసాను. గత నెలరోజులలో నాలుగు సందర్భంలో మత్స్యకారులను అరెస్ట్ చెయ్యటం జరిగిందని జయలలిత అన్నారు.

ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి నిర్వాకం వలనే ఈ ఒప్పందం అలా అయిందని, ఆయనే గనక సరైన నిర్ణయం తీసుకునుంటే పరిస్థితి ఇక్కడివరకూ వచ్చేది కాదని జయలలిత అన్నారు.

జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నదేమిటంటే,

మత్స్యకారుల మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించాలి. దారుణంగా దాడులకు పాల్పడటం, మత్స్యకారులను అరెస్ట్ చెయ్యటంలాంటి చేష్టలను నివారించటానికి ఇప్పటికైనా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో ఉన్న శ్రీలంక దౌత్య కార్యాలయ అధికారిని పిలిపించి శ్రీలంక చేసే దాడులను నిరసించాలి. వీటితో పాటు కచ్చాతీవు ఒప్పందాన్ని రద్దు చెయ్యటానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలి.

అలా చెయ్యకపోతే సుప్రీం కోర్టులో తేల్చుకుంటామని కూడా జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gang rape in amritsar leaves doublts
Bsp leader deepak bhardwaj murdered in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles