Cbi raid on stalin house

dmk party, cbi raids, stalin, karunanidhi, chidambaram, directorate of revenue

cbi raid on stalin house

cbi-raid.png

Posted: 03/21/2013 10:58 AM IST
Cbi raid on stalin house

stalin-karuna

ఈరోజు ఉదయం తమిళనాడులో స్టాలిన్ ఇంటితో పాటు మరో 19 ప్రదేశాలలో సిబిఐ దాడులు నిర్వహించింది.   దాడులకు కారణం తెలియదని కానీ ఇది కచ్చితంగా రాజకీయ వైరం వలన జరుగుతున్నదని చెప్పగలనని, యుపిఏ మద్దతుని వెనక్కి తీసుకోవటం వలన జరిగిన పనేనని, దీనిమీద కోర్టుకి వెళ్తానని కరుణానిధి రాజకీయ వారసుడిగా అందరూ చెప్పుకుంటున్న స్టాలిన్ అన్నారు.  

ఆకస్మిక దాడులకు సిబిఐ చెప్పిన కారణం ఇది-

ఒక లిమోజిన్ తో సహా కొన్ని కార్లను దిగుమతి చేసుకున్న విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూలో ఒక సీనియర్ అధికారి మురుగానందన్ ని మరో ఇద్దరు అధికారుల మీద నిన్న సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, వాళ్ళు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అక్రమ దిగుమతుల లావాదేవీల మీద చర్యలు తీసుకోలేదు.  ఆ లావాదేవీలలో తెలియని కొందరు వ్యక్తులతో కలిసి ఆర్ధిక నేరానికి పాల్పడుతూ, ప్రభుత్వానికి 20 కోట్ల ఆదాయానికి గండికొట్టారు.  అందులో ఒక కారుని స్టాలిన్ కుమారుడు వాడుతున్నాడని, మిగిలినవాళ్ళ వివరాలు దర్యాప్తులో తేలుతాయని దర్యాప్తు సంస్థ చెప్తోంది.  సిబిఐ వాళ్లకి అందిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి చేస్తున్న దర్యాప్తులో ఇంకా కొంత మంది వ్యాపారస్తుల ఇళ్ళు, ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయని సిబిఐ అధికారులు తెలియజేసారు.  

స్టాలిన్ ఇంటి దగ్గర సిబిఐ దాడి విషయం తెలియగానే డిఎమ్ కే నాయకులు పెద్ద సంఖ్యలో స్టాలిన్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. 

ఈ సందర్భంలో స్టాలిన్ మీద సిబిఐ విచారణ దురదృష్టకరమని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడుతున్నారు.  కారణం ఏదైనా, ఈ సందర్భంలో అది పలు అనుమానాలకి దారితీస్తుందని, అందువలన దానికి సంబంధించిన మంత్రికి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేసానని చిదంబరం అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Biological e cmd datla vijaya kumar died
Arrests of leaders in sadak bundh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles