Every one prepared for sadak bundh

sadak bundh program, trs party, bjp party, tjac, police chekposts

every one prepared for sadak bundh

sadak-bundh-program.png

Posted: 03/21/2013 08:32 AM IST
Every one prepared for sadak bundh

harish-rao

ఈరోజు హైద్రాబాద్ బెంగళూరు హైవే మీద సడక్ బంద్ ని ఎలాగైనా సరే విజయవంతం చెయ్యాలని తెలంగాణా వాదులు వ్యూహరచనలు చేస్తుంటే, ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని పోలీసు బలగాలు కట్టుదిట్టాలు చేసుకున్నాయి.  

ఒక్క దగ్గరే ఉంటే అడ్డుకోవటానికి పోలీసులకు సులభమవుతుంది కాబట్టి విడి విడిగా బృందాలుగా విడిపోయి వివిధ కార్యక్రమాలతో రహదారిని బంద్ చేద్దామనే ఆలోచనలో రకరకాల వ్యూహలను తెలంగాణా వాదులు పన్నుతున్నారు.

ఉదయం టిఫిన్లతో మొదలుపెట్టి మధ్యాహ్నం భోజనాలు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు. మరోపక్క మోటార్ సైకిల్ ర్యాలీ ఇలాంటి విభిన్న కార్యక్రమాలతో కార్యకర్తలను వ్యస్తులను చేస్తూ, మధ్య మధ్య ఉత్సాహపరుస్తూ, ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఓడించాలనే పద్ధతిలో యువతను ఉసిగొలుపుతూ ఉండటానికి నేతలు సిద్ధమవుతున్నారు.  

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం శాసనసభలో ప్రతిపాదన పెట్టాలన్న కోరికతో తెలంగాణా ఐకాస ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఆందోళనలో, తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, న్యూడెమాక్రసీ, సిపిఐ, సిపిఐ(ఎంఎల్), పార్టీలు పాల్గొంటున్నాయి. 

police-plan

అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు సరిగదా, ఇష్టారాజ్యంగా తెలంగాణా వాదులు చెయ్యటాన్ని సహించమనటానికి సంకేతంగా ఉద్యమకారుల మీద కఠినంగా ప్రవర్తించాలన్న సందేశాలు పోలీసు బృందాలకు చేరాయి.  ఎనిమిది వేల మందితో రహదారి మీద విస్తృతంగా పహరా కాస్తున్న పోలీసు బృందాలు నిన్న సాయంత్రం నుంచే పరిస్థితిని అదుపులోకి తీసుకుంటూ ఆరామ్ ఘర్, శంషాబాద్, పాల్మాకుల, తిమ్మాపూర్ చౌరస్తా వరకూ ముఖ్యమైన ప్రాంతాలలో తాత్కాలిక చెక్ పోస్ట్ లు, పికెట్లను ఏర్పాటు చేసి రహదారి మీద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనా జరగకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు.  తెలంగాణా వాదులు అంటున్నట్టుగా ముందుగా ఎవరినీ అదుపులోకి తీసుకోవటం జరగలేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు.  

police-readiness

విమానాశ్రయానికి గట్టి బందోబస్తు చేసారు.  అయితే విమానాశ్రయం జోలికి పోవద్దని తెలంగాణా ఆందోళనకారులకు వారి నేతలు ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No consensus on srilankan tamils problem
All party meeting called by pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles