Comments of leaders on ap budget

political leaders comments on ap budget 2013-14, andhra pradesh budget for 2013-14, anam ramnarayan reddy, minister for finance , andhra pradesh, congress, tdp, telangana, politics, bjp, general,

comments of leaders on ap budget

ap-budget.gif

Posted: 03/19/2013 10:01 AM IST
Comments of leaders on ap budget

comments of leaders on ap budget

రాష్ట్రంలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం పార్టీని ప్రధానంగా ప్రాముఖ్యతను తెచ్చి పెట్టే విధంగా ఉంది.  ఇందులో విద్యుత్ కొరతను ఎదుర్కునే విషయం గురించి, ఉత్పాదన గురించి ఏమీ సూచించ లేదు.  ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణా ప్రస్తావన ఎంత మాత్రమూ లేదుఇవీ ప్రముఖంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు.

రైతులకోసం రూపొందించిన బడ్జెట్ గా ప్రచారం చేసినా పోయిన సంవత్సరం కంటే 1210 కోట్ల రూపాయలు తక్కువగా కేటాయించటం, పోలవరం, చేవెళ్ళకి జాతీయ హోదా లభించి కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశించటం హాస్యాస్పదంగా ఉందంటూ పలు నేతలు ఆక్షేపించారు.  ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా వ్యవసాయాభివృద్ధికోసం తయారైన బడ్జెట్ అంటూ ఎంతో గొప్పగా చెప్పుకున్నాఅదంతా ఒట్టి మాటలే అని తేలిపోయిందని విపక్షనేతలు, రాజకీయ విమర్శకులు అంటున్నారు. 

దీనివలన వ్యవసాయాభివృద్ధి తిరోగమనంలో ఉంటుందని, ఇందులో తాగునీటి సమస్య ఊసే లేదని, విద్యత్ కొరతను పట్టించుకోవటం లేదని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  అదే పార్టీ నేత దాడి వీరభద్రరావు, ఇదో మోసపూరితమైన బడ్జెట్ అని, మాయలూ, మంత్రాలూ కుతంత్రాలతో కూడుకున్న బడ్జెట్ లా కనిపిస్తోందని అన్నారు.  తెదేపా నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఈ బడ్జెట్ సంక్షేమం కంటే సంక్షోభానికే ఎక్కువ తావిస్తుందని అన్నారు.  వ్యవసాభివృద్ధి ప్రణాళికంటూ చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ అశోక గజపతిరాజు ఎద్దేవా చేసారు.

comments of leaders on ap budget

 

రైతుల గురించి కల్లిబొల్లి మాటలు కవితలు చెప్తే ఏం ప్రయోజనం.  కేటాయింపులేమో తగ్గించారు.  ముందు చూపు లేని బడ్జెట్ అంటూ లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. 

రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటావుంటే వ్యవసాయరంగానికి కేటాయించే నిధులను తక్కువ చేసారంటూ తెరాస నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. 

ఇది బడ్జెట్ కాదు యాక్షన్ ప్లాన్.  ప్రభుత్వం సభను తప్పు దోవ పట్టిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. 

బిసిల కోసం నిధులను చాలా తక్కువ కేటాయించారంటూ భారతీయ జనతా పార్టీ నేత యెండల  లక్ష్మీ నారాయణ ఆరోపించారు. వ్యవసాయరంగంలో తక్కువ నిధులను కేటాయించారు. అందుకు రైతులు క్షమించరంటూ సిపిఎమ్ నేత జూలకంటి రంగారెడ్డి వ్యాఖ్యానించారు.  సిపిఐ నేత గుండా మల్లేష్ ఈ బడ్జెట్ ని ఎన్నికల్లో ఓట్ల కోసం తయారు చేసిందంటూ విమర్శించారు. 

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big spiritual program at keesara gutta
Upa successful in buying time form karunanidhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles