Yadagiri guttapng

yadagiri-gutta.png

Posted: 03/14/2013 08:10 AM IST
Yadagiri guttapng

yadagiri-templeయాదగిరి గుట్ట నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.  ఈ ఉత్సవాలు 11 రోజులు సాగుతాయి.  ఆగమ శాస్త్ర పద్ధతిలో ప్రాచీనమైన ఆచారంలో నిష్టగా సాగే అర్చనాది కార్యక్రమాలు జరపటానికి ఆలయ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుందని ఈవో కృష్ణవేణి తెలియజేసారు.   24 వరకూ జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ యాజమాన్యం భావిస్తోంది.

ముఖ్యమైన కార్యక్రమాలలో, 21 న జరిగే కళ్యాణోత్సవానికి ముందుగా 20 వ తేదీన ఎదుర్కోలు ఉంటుంది.  22 న రథోత్సవం, ఆఖరి రోజు 24 న అష్టోత్తర శత ఘటాభిషేకం, డోలోత్సవాలుంటాయని ఈవో తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ లోని పురాతనమైన ఆలయాల్లో హైద్రాబాద్ కి సమీపంలో నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్ట ఒకటి.  హైద్రాబాద్ కి దగ్గరగా ఉండటం, వరంగల్ హై వే మీద ఉండతో ఈ ఆలయానికి రాకపోకలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.  అందువలన ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  హైద్రాబాద్ కి చేరువగా ఉండటంతో రియల్ వ్యాపారం కూడా ఇక్కడ చాలా సంవత్సరాలుగా బాగా సాగుతోంది.  దాని వలన కూడా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

భక్తులకు సౌకర్యాలకోసం ఆలయ ప్రాంగణమెంత అభివృద్ధి చేసినా గర్భగుడిని యథా తథంగా ఉంచి ఈ ఆలయంలో ప్రాచీన విశిష్టతకు భంగం కలుగకుండా చూసుకోవటం ఇక్కడి విశేషం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Opposition parties prepared for no confidence motion
Hc petition for enquiry on jana reddy assets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles