Ap budget session started with uproad as expected

ap assembly, budget session, governor of ap, tdp, trs, congress

ap budget session started with uproad as expected

budget-session-ap.png

Posted: 03/13/2013 10:30 AM IST
Ap budget session started with uproad as expected

governor-speechఊహించినట్లుగానే ఈ రోజు శాసన సభలో ఉద్వేగాలు, రభసలు, రచ్చలతో సభాపర్వం ప్రారంభమైంది.  ప్రారంభోపన్యాసకులు గవర్నర్ నరసింహన్ ని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఇలా గవర్నర్ ప్రసంగం మొదలైందో లేదో తెరాస నాయకులు ఆందోళనకు దిగి ప్రసంగ ప్రతులను చింపి పడేసారు.  జై తెలంగాణా అంటూ నినదించసాగారు.  

అటు తెలుగు దేశం పార్టీ కూడా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించింది.  గవర్నర్ ప్రసంగం మొదలవుతుండగానే లేచి నిల్చున్న తెదేపా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేపట్టి సభను బహిష్కరించారు.  

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రూపొందిస్తున్న ప్రణాళికల ప్రస్తావన తెస్తూ గవర్నర్ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చారిత్రాత్మకంగా పరిగణించదగిందంటూ కొనియాడారు.  అలాగే ఆర్థిక విధానాలు కూడా ప్రశంసనీయమని అన్నారు.  ఉగ్రవాదాన్ని ప్రభుత్వం ఉపేక్షించదని, సిసి కేమెరాలతో నిఘాని పెంచుతామని, ఉగ్రవాద దాడులకు గురైన వారిని ఆదుకుంటామని అన్నారు.

బయటకు వచ్చిన తెదేపా శాసన సభ్యులు, గవర్నర్ అబద్ధాలు చెప్పటం వలనే బహిష్కరించామని అన్నారు.  ఇది దొంగల ప్రభుత్వమని, దాన్ని గవర్నరేమో తన ప్రభుత్వమంటూ మాట్లాడుతున్నారని వాళ్ళు ఆరోపించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Question hour of both houses were wasted
Final charge sheet to be filed by march end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles