Prime accused in delhi gang rape case committed suicide

delhi gang rape, prison deaths, tihar jail, juvenile court

prime accused in delhi gang rape case committed suicide

delhi-rape-accused.png

Posted: 03/11/2013 09:27 AM IST
Prime accused in delhi gang rape case committed suicide

delhi-victim

డిసెంబర్ 16 న ఢిల్లీలో 23 సంవత్సరాల మహిళ మీద కదులుతున్న బస్సులో అతి అమానుషంగా జరిగిన సామూహిక అత్యాచారం నేరం మీద పట్టుబడి తిహార్ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఈ రోజు ఉదయం 5 గంటలకు జైల్లో ఆత్మహత్మ చేసుకున్నాడు.  

సామూహిక అత్యాచారం చేసిన వారిలో నేరారోపణలో ఉన్న మొత్తం ఆరుగురిలో రామ్ సింగ్ ప్రధాన నిందితుడైతే ఒక 17 సంవత్సరాల మైనర్ కూడా వారితో పాటు ఉన్నాడు.  అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు చాలా వేగంగా పనిచేసి దక్షిణ ఢిల్లీ ఆర్.కె.పురం లో నివసించే రామ్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు.  బాధితురాలు డిసెంబరు 29 న సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించింది.  చివరి ఊపిరి వరకూ దుర్మార్గులకు శిక్ష పడాలి, తనకు న్యాయం జరగాలి అది చూడటానికైనా తాను బతికుండాలని మృత్యువుతో 13 రోజులు పోరాడి అలసిపోయి న్యాయనిర్ణయం జరగక ముందుగానే చనిపోయింది.  ఆమెను అమెరికా ప్రభుత్వం వీరవనిత గా గుర్తించి పురస్కారం ప్రకటించారు.  

తీహార్ జైల్ సెల్ నం.3 లో ఉంచిన రామ్ సింగ్ తెల్లవారి 5 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం అందింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sivaratri performed at srisailam in traditional manner
Apcc president botsa satyanaryana announces preparedness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles