Bomb blast in peshawar masjid killed 6

peshawar, pakistan, bomb blast in peshawar, talibans

bomb blast in peshawar masjid killed 6

bomb-blast.png

Posted: 03/09/2013 04:08 PM IST
Bomb blast in peshawar masjid killed 6

bomb-blast-in-pak
పాకిస్తాన్ పెషావర్ పట్టణంలో మసీదులో బాంబు పేలి ఆరుగురు మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు.  రద్దీగా ఉండే మీనాబజార్ ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రార్ధనా సమయంలో ఈ బాంబు పేలుడు జరిగినప్పుడు మసీదు 30 మంది వరకూ ఉన్నారు, మార్కెట్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారని ఘటనా సమయంలో అక్కడ ఉండి చూసినవారు చెప్పారు.  బాంబు పేలుడు తాకిడికి మసీదు లోపల నష్టం జరిగినట్టుగా టివి ఫుటేజ్ లో కనిపించింది.  మసీదు గోడలు కొన్ని కూలిపడ్డాయి.  

సహాయక బృందాలకు ఇరుకు సందులు చాలా ఇబ్బంది కలిగించాయి.  వాయువ్య పాకిస్తాన్ పెషావర్ సమీప ప్రాంతాలు ఈ మధ్యకాలంలో తాలిబాన్ల దాడులకు గురవుతున్నాయని అంటున్నారు.

ఈ బాంబు దాడుల వలన, ఉగ్రవాదులకు మతంతో సంబంధమేమీ లేదన్న విషయం స్పష్టంగా ఉంది.  అయితే తాలిబాన్లను పాకిస్తాన్ రాజకీయ లబ్ధికోసం అప్పుడు తయారు చేస్తే అది వాళ్ళ మెడకే చుట్టుకుంటోందనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahrukdh khan honors women
Shops on mysore road demolished  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles