తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ప్రకటించిన వచ్చే సంవత్సరం అంచనాల ప్రకారం అంటే 2013-14 ఆర్థిక సంవత్సరానికి తితిదే ఆదాయం 2248 కోట్లు ఉంటుంది. అంటే అమెరికన్ కరెన్సీలో అర్ధ బిలియన్ డాలర్లు!
555.20 కోట్ల రూపాయలు అంటే మొత్తం ఆదాయంలో దాదాపూ నాలుగోవంతు ఆదాయం వడ్డీ రూపంలో వస్తుంది. ఇవి కాక భక్తుల కానుకలు, తలనీలా వేలం, లడ్డూ ప్రసాదాలు, కళ్యాణ ఆర్జిత సేవల్లాంటి ఆదాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే మిగతా ఆదాయాలను 2012-13 మాదిరిగానే వచ్చే సంవత్సరానికి కూడా అంచనా వేసినా, వడ్డీ ఆదాయాన్ని మాత్రం ఈ సంవత్సరం ఉన్న 490 కోట్ల రూపాయల స్థానంలో వచ్చే సంవత్సరం 555.20 కోట్లు ఉంటుందని అంటున్నారు.
తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రకటించిన 2013-14 బడ్జెట్ వివరాలలో, ఆదాయంలో అధిక భాగం హుండీలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో వస్తుందని, అది 859 కోట్ల రూపాయలుంటుందని అంచనా అని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యం చూడటమే కాకుండా కార్యక్రమాలను నిర్వహించే సిబ్బందికి ఇచ్చే జీత భత్యాలే 350 కోట్ల రూపాయలు. ఇలా వేలాది మందికి ఉపాధి కల్పించటమే కాకుండా, ఇంకా ఎంతో మందికి వ్యాపారంలో గడించే అవకాశం కూడా కలుగజేసింది. తిరుపతి లాడ్జిలు, హోటళ్ళు, టాక్సీలు నడిపేవారు కూడా ఎంతో మంది డబ్బు గడిస్తూ బ్రతుకుని వెళ్ళదీసుకోగలుగుతున్నారంటే అదంతా వెంకన్న చలవే అంటారు వాళ్ళు.
తిరుపతి స్థల పురాణంలో చెప్పినట్టుగా వేంకటేశ్వర స్వామి పద్మావతిని వివాహమాడటం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, ఆ అప్పుని తీరుస్తూనే ఉన్నాడని అంటుంటారు. సంవత్సరం సంవత్సరం ఆయన ఆదాయం పెరిగిపోతూవుంది. ఇప్పటికైనా ఆ అప్పు తీరిందో ?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more