Indian economic growth beat chinas in feb hsbc survey

indian economic growth, china india, hsbc india, emerging market economies

indian economic growth beat chinas in feb: hsbc survey

hsbc-survey.gif

Posted: 03/07/2013 01:39 PM IST
Indian economic growth beat chinas in feb hsbc survey

indian economic growth beat china's in feb: hsbc survey

భారత్  ఆర్థిక  వ్యవస్థ  జోరందుకుంది... ఫిబ్రవరి  నెలలో చైనాను  మించిపోయింది.  భారత్  కాకుండా  మిగిలిన  అభివ్రుద్ది చెందుతున్  దేశాల్లో   కూడా వ్రుద్ది రేటు కాస్తా మెరుగుపడిందని  హెచ్ ఎస్ బీసీ సర్వేలో   తేలింది. హెచ్ బీసీ  ఎమర్జింగ్  మార్కెట్   ఇండెక్స్  (ఈఎంఐ) నెలవారి సర్వేలో జనవరిలో 53.8 పాయింట్ల నుంచి ఫిబ్రవరి నాటికి 52.3కి తగ్గిపోయింది. ఆగస్టు 2012 తర్వాత ఆ స్థాయిలోపడిపోవడం ఇదే మొదటిసారి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంది. ఫిబ్రవరిలో హెచ్‌ఎస్‌బీసీ భారత్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌... దీంతో తయారీ రంగంనుంచి సేవల రంగం వరకు ఉంటుంది. 54.8 పాయింట్లకు ఎగబాకగా... చైనా 51.4 పాయింట్ల వద్ద తచ్చాడుతోంది. సూచి 50 పాయింట్లు దాటితే వృద్ధిబాటలో కొనసాగుతున్నట్లు లెక్క అభివృద్ధి చెందుతున్న దేశాలను పరిగణనలోకి తీసుకుంటే చైనాతో పాటు భారత్‌ బ్రెజిల్‌లో వృద్ధి రేటు మందగించింది.  అయితే చైనాతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో భారత్‌ వృద్ధిరేటు పెరిగింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధిరేటు పుంజుకున్నా అంత పెద్ద జోరు మాత్రం లేదు. ముఖ్యంగా తయారీ రంగంతో పాటు సేవల రంగం డీలాపడ్డాయి. కొత్త సంవత్సరంలో బ్రిక్‌ దేశాల్లో కాస్తా జోరందుకున్నా రాను రాను మందగించిందని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ ఎకనమిస్టు సెంట్రల్‌ అండ్‌ ఈస్ట్రన్‌ యూరోప్‌ సబ్‌ సహారన్‌ ఆఫ్రికా కు చెందిన మురాత్‌ ఉలేగన్‌ చెప్పారు. నాలుగు బ్రిక్‌ దేశాల ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనాలు జనవరి నుంచి వేగం తగ్గిందని గత మూడు నెలల నుంచి ఉద్యోగాల భర్తీ కూడా చాలా తక్కువగా ఉందని హెచ్‌ఎస్‌బీసీ నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఫిబ్రవరి ఈఎంఐ నివేదికలో బ్రిక్‌ దేశాలకు ముఖ్యంగా తయారీ రంగం నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ... ఫిబ్రవరి నెల సూచి ప్రకారం చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు వృద్ధి రేటు అత్యంత కీలకమైనదని ద్రవ్యోల్బణానికి రెండవ ప్రాధాన్యం ఇస్తున్నారని ఉలేగన్‌ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మాంద్యం తాత్కలికమేనని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఉలేగన్‌ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles