Public grievances bill to be redressed

parliament of india, public grievances bill, govt of india

public grievances bill to be redressed in parliament

grievances-bill.png

Posted: 03/07/2013 10:32 AM IST
Public grievances bill to be redressed

publict-grievances-cellరెవిన్యూ ఇతర సేవల మీద ప్రభుత్వం కొరడా ఝళిపిస్తానంటోంది.  ప్రజలకు అందవలసిన పెన్షన్లు, పాస్ పోర్ట్ లు, రేషన్ కార్డ్ లు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, అధిక పన్నుల తిరిగి చెల్లింపులు సకాలంలో అందజేయాలని, అలా చెయ్యని పక్షంలో అనుమతించిన కాలాన్ని మించిన తర్వాత ప్రతిరోజుకీ రూ.250 చొప్పున సుంకం విధిస్తామని, ఆ సుంకం గరిష్ట పరిమితి రూ.50000 వరకూ ఉండవచ్చని చెప్తూ ఆ మేరకు ఈరోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.  

దీని ద్వారా జవాబుదారీ పద్ధతిలో పనులు జరిగి, ప్రజలకు సేవలు సమర్ధవంతంగా చేరవేయటం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  అయితే ఇప్పుడు ఏ పని చేసినా అది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శించటం, ఏ పని చేసినా విమర్శించటమే పనిగా పెట్టుకున్నారంటూ అధికార పక్షం అనటం పరిపాటైపోయింది.  ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకోసం చేస్తేనేం అని వీళ్ళూ ఊరుకోరు, ప్రజా హితంలో పనిచేస్తున్నామని చెప్పుకునే అవకాశం ఏమాత్రం వచ్చినా వాళ్ళూ వదులుకోరు.

 కానీ, సకాలంలో సేవలనందుకునే హక్కు ప్రజలకుంది కాబట్టి ప్రజా ఫిర్యాదుల బిల్లుని పటిష్టంగా చేసి పార్లమెంటులో పాస్ చేస్తామంటున్నారు అధికార పక్షాలవారు.  ఇది ప్రజాహితంలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలు దీనికి అడ్డు చెప్పటానికీ వీల్లేదు. చాలా బాగా చేసారంటూ మెచ్చుకోవటానికీ వీలు లేని పరిస్థితి

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Centralised phone tapping system under way
More power cuts in the state capital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles