Hugo chavez president of venezuela died

venezuela, hugo chavez, hugo chavez died

hugo chavez president of venezuela died

chavez-dead.png

Posted: 03/06/2013 08:42 AM IST
Hugo chavez president of venezuela died

 

hugo-chavez-photoకరాకస్ మిలిటరీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెనుజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ నిన్న కన్నుమూసారు.  

కాన్సర్ తో బాధపడుతున్న ఆయనకు 2011 నుండి క్యూబా హాస్పిటల్ లో నాలుగుసార్లు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాలేదు.  అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆయన 2012 లో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  కానీ అనారోగ్య పరిస్థితి కారణంగా చావేజ్ అధ్యక్షుడిగా తన విధులను నిర్వర్తించలేకపోయారు.  ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు.  

చావేజ్ వెనుజులాను 14 సంవత్సరాలపాటు పాలించి, 1998 లో నిర్వహించిన ఎన్నికలలో అధ్యక్షుడు గా ఎన్నుకోబడ్డారు.

 చావేజ్ మరణవార్తను రేడియో, టివిలో ప్రకటించిన ఉపాధ్యక్షుడు నికొలస్ మాడురో, ఆయన మంగళవారం సాయంత్రం 4.25 కి తుదిశ్వాస వదిలారన్న విషయాన్ని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు.  ఇది జాతీయ విపత్తు అంటూ ప్రజలను శాంతి సంయమనాలను పాటించమని కోరారు.  

లాటిన్ అమెరికాను అభివృద్ధి పరచిన మహానేతగా పలుదేశాలు చావేజ్ ని కొనియాడుతూ, ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేసాయి.  అమెరికన్ అధ్యక్షుడు బారక్ ఒబామా వెనుజులా వాసులకు తన సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Intelligence warns hyderabad again
Pranab visits his in laws house in narail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles