Husban kills wife in konark express

konark express, amudala valasa, murder, railways

husban kills wife in konark express

murder-in-konark.png

Posted: 02/21/2013 09:57 AM IST
Husban kills wife in konark express

రైలులో గొడవ చిలికి చిలికి గాలి వానైంది.  రైల్లో ప్రయాణం చేస్తూ పగలంతా దెబ్బలాడుకుంటూనే ఉన్న భార్యా భర్తలు అర్ధరాత్రి వరకూ రాజీకి రాలేకపారు.  ఇంటికి చేరుకునేంత వరకూ కూడా సహనాన్ని వహించలేని ఆ జంట రైల్వే భోగీ బాత్ రూంలో కూడా  ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ గడిపారు.  వాళ్ళ కేకలు విన్న ప్రయాణీకులు, టిటిఇ ఎంత తలుపులు కొట్టినా వాళ్ళు తియ్యలేదు.  బలవంతంగా తలుపులు విరగ్గొట్టి చూస్తే ఏముంది, భార్య రక్తం ఓడుతూ చనిపోయిఉంది.  భర్త తాగిన మద్యం ప్రభావం అప్పటికీ దిగలేదు.  పోలీసులు ఏమడిగినా నోరు మెదపలేదు. 


ఈ సంఘటన నిన్న రాత్రి కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది.  ఒడిశా వెళ్తున్న కోణార్క్ ఎస్-7 భోగీలో లతా ప్రకాశ్ బెహరా, కిషోర్ బెహరా అనే భార్యా భర్తలు విశాఖ పట్నం నుంచీ గొడవపడుతూనే ఉన్నారు.  గొడవ ముదిరిపోయేటప్పటికి ఆముదాల వలస లో రైలు ఆపి, పోలీసుల సాయంతో టిటిఇ భోగీలోని బాత్ రూం తలుపులు విరగ్గొట్టి చూస్తే జరిగిన దారుణం కనిపించింది.  లోపల దాదాపూ గంట వరకూ ఇద్దరూ పెనుగులాడిన శబ్దాలను ప్రయాణీకులు విన్నారు.  భర్త చంపే ప్రయత్న చేస్తుంటే ఆమె ప్రాణాలను రక్షించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించినట్టు గా కనిపిస్తోంది.  పగిలిన గాజు పెంకులు, రక్తపు మరకలు, చనిపోయి పడివున్న మహిళను చూసి అందరూ మనస్తాపానికి లోనయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rural technical exhibition 2013 in hyederabad
Ys viveka threatens to commit suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles