Government green signal for samara deeksha

telanga issue, t jac, telangana agitation, ktr, kcr, kodandaram, sabita indra reddy, govt, state govt, government green signal for samara deeksha, samara deeksha pics, trs, bjp, student jac, ou,

government green signal for samara deeksha

5.gif

Posted: 01/27/2013 02:31 PM IST
Government green signal for samara deeksha

sa

       తెలంగాణా వాదులు కావాలని, సర్కారు వద్దని సాగిన  సమరదీక్ష ఎట్టకేలకు సాగుతోంది. ఇన్నో నాటకీయపరిణామాల నడుమ దీక్షకు అనుమతి ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కొద్దిసేపటిక్రితం వరకూ ప్రభుత్వంతో విద్యావేత్త చుక్కా రామయ్య జరిపిన మధ్యవర్తిత్వం సఫలమైంది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో చుక్కా రామయ్య సమావేశమై, చర్చించి ...సమరదీక్షకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఇందిరాపార్కు వద్ద సమరదీక్షను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సోమవారం సాయంత్రం వరకే సమరదీక్ష నిర్వహించాలని ఆంక్షల్ని విధించింది. తెలంగాణపై ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడంతో సమరదీక్షకు తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది.
        ఇదిలా ఉండగా, అనుమతికి ముందు చాలా పరిణామాలే చోటుచేసుకున్నాయి....  ఇందిరాపార్కు సమీపంలోని తెలంగాణ జేఏసీ కార్యాలయం వద్ద సిరిసిల్లా ఎమ్మెల్యే కే. తారకరామారావు (కేటీఆర్‌)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమరదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని సమరదీక్షలో పాల్గోనేందుకు వచ్చిన కేటీఆర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేటీఆర్ ను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

cc
      మరోవైపు... తెలంగాణవాదులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని స్వామిగౌడ్ ఆరోపించారు. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించేందుకు వచ్చిన స్వామిగౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా సమరదీక్ష నిర్వహించి తీరుతామని స్వామిగౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించేందుకు కూడా ప్రభుత్వం అనుమతించక పోవడం చాలా శోచనీయమని ఆయన అన్నారు.

dd
    ఇంకోవైపు... ఎట్టి పరిస్థితుల్లోనూ సమరదీక్షను నిర్వహించి తీరుతామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. నిర్బంధం ద్వారా దీక్షను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు ఆదివారం సాయంత్రంలోగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఫిబ్రవరిలో 'చలో హైదరాబాద్' లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. అసెంబ్లీ నుంచి జేఏసీ కార్యాలయం వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో టీఎన్‌జీవో జేఏసీ నేతలను అరెస్ట్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana bandh on january 29
Final verdict on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles