Sonia discusses telangana issue with senior party leaders

sonia gandhi, sonia discusses telangana issue, senior party leaders, sushil kumar shinde, minister vayalar ravi and ahmed patel, congress meet on telangana issue, sonia gandhi meet

Sonia discusses Telangana issue with senior party leaders

Sonia discusses.gif

Posted: 01/23/2013 06:43 PM IST
Sonia discusses telangana issue with senior party leaders

Sonia discusses Telangana issue with senior party leaders

తెలంగాణపై ఢిల్లీలో కీలకమైన చర్చలు జరిగాయి. కేంద్ర నాయకులు షిండే, వయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ బుధవారంనాడు పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధితో కీలకమైన చర్చలు జరిపారు. తెలంగాణ ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గతంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ 28 వ తేదీ కల్లా తెలంగాణాపై అధికార ప్రకటన వెలువడుతుందని ప్రకటించడంతో అందరూ ఆ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా కేంద్రంలోని ముఖ్యమైన నాయకులు వివిధ వర్గాలవారితో సంప్రదింపులు జరుపుతున్నారు. జరిగిన సమావేశం తెలంగాణ కు సంబంధించి అతి కీలకమైన సమావేశంగా భావిస్తున్నారు. తెలంగాణ అనుకూలంగా, ప్రతికూలంగా అందించిన వివరాలను కేంద్ర నాయకులు నేటి సమావేశంలో సోనియాకు వివరించినట్టు తెలుస్తున్నది. అలాగే హోం శాఖ నిఘా విభాగం అందించిన నివేదిక సారాంశాన్ని కూడా షిండే ఈ సమావేశంలో సోనియాకు వివరించినట్టు తెలుస్తున్నది. ఈ సమావేశం గురించి ఎవరు ఏమి అడిగినా ఢిల్లీలో ఎవరూ ఏమీ వెల్లడించడానికి సిద్ధంగా లేరు. దీన్ని బట్టి 28 వ తేదీన ఖచ్చితంగా కేంద్రంనుంచి తెలంగాణపై అంతిమ ప్రకటన వెలువడగలదని విశ్వసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One month does not mean 30 days says azad
Rahul gandhi takes charge as congress vice president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles