Harish rao all party meet a congress party sham to deceive people

trs mla harish rao, all-party meeting as fake meeting, fake meeting, trs congress party,harish rao speaks on all party meeting, nakili meeting,all-party meeting on telangana, december 28th all party meeting on telangana, all political parties, central government

harish rao : All-party meet a Congress party sham to deceive people

harish rao.gif

Posted: 12/28/2012 02:46 PM IST
Harish rao all party meet a congress party sham to deceive people

All-party meet a Congress party sham to deceive people

ఆల్ పార్టీ మీటింగ్ అని  రాజకీయ పార్టీలన్ని  చంకలు బాదుకుంటే ఢిల్లీకి  వెళ్లి ఏం చేశారు. అందరు కలిసి  మరో కొత్త నాటకానికి తెరలేపారని  తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు.   అన్ని రాజకీయ పార్టీలు   ఏం చెప్పాయి. పాత పాటనే మళ్లీ ఢిల్లీలో  పాడాయి.  వారు పాడిన  పాటలకు కేంద్రానికి జోలపాడినట్లుగా ఉందని ఆయన అన్నారు.  రాజకీయ పార్టీలు పాడిన జోలపాటకు  కేంద్రం నెల రోజులు నిద్రపోతుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.  కేంద్ర నిద్ర లేసిన తరువాత తెలంగాణ పై  నిర్ణయం చెబుతుందని హోంమత్రి చెప్పటం పై హరీస్ రావు ఆగ్రహంవ్యక్తం చేశారు.   కాంగ్రెస్ పార్టీ  మోసపూరిత  వైఖరి  పరంపరను కొనసాగించిందని ఆయన మండిపడ్డారు.   అసలు తెలంగాణకు , అనుకూలమో, వ్యతిరేకమో  కాంగ్రెస్ పార్టీ  స్పష్టం చేయాలని హారిస్ రావు  డిమాండ్ చేశారు.  అంతేకాకుండ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం నకిలీపక్షంగా మరిందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ఒకే అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేసినా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజల అభిప్రాయాలని గౌరవించలేదని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వత జరిగిన అఖిలపక్షంలో అప్పటి హోమంత్రి నాలుగు వారాల్లో నిర్ణయం అన్నాడని, ఇప్పటి హోంమంత్రి షిండే నెలరోజులు అంటున్నాడని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ షీల్డ్ కవర్లో నిర్ణయం చెప్పడంలో మోసం ఉందని తెలిపారు. తెలంగాణను ముగింపులేని సీరియల్‌గా కాంగ్రెస్ మార్చిందన్నారు.  తెలంగాణ పై  కేంద్రం వైఖరి ఎండగడుతూ రేపటి  బంద్ ను  విజయవంతం చేయాలని  టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రజలకు పిలుపు నిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara lokeshgif
Trs leader kcr unhappy calls for telangana bandh on saturday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles