Bus fare fares to increase on january 1 2013

apsrtc, surcharges, imposing, passengers, newyear 2013, 50paise ordinary busses per ticket, one rupee express

apsrtc, surcharges, imposing, passengers, newyear 2013, 50paise ordinary busses per ticket, one rupee express

Bus Fare to increase on January 1_ 2013.png

Posted: 12/27/2012 08:44 AM IST
Bus fare fares to increase on january 1 2013

bus_chargesమన రాష్ట్రంలో పండగా సీజన్ అన్నట్లు... వాయింపుల సీజన్ కూడా ప్రారంభమైనట్లే కనిపిస్తుంది. మొన్నటి వరకు విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచుకుంటూ పోయి జనాలకు బతుకు భారం చేసిన ప్రభుత్వం మరో భారం మోపడానికి సిద్ధం అయింది. కొత్త సంవత్సరం ప్రారంభం అంటే జనవరి ఒకటి నుండి సామాన్యుడి పై మరో భారం మోపడానికి సిద్ధం అయింది ఆర్టీసీ. గతంలో డీజీల్ రేట్లు పెరిగాయంటూ బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ కనీసం మూడు నెలలు గడవక ముందే ‘డెవలప్ మెంట్ సెస్ ’ పేరుతో వంద కిలో మీటర్లకు రూపాయి చొప్పున భారం వేయడానికి సిద్ధం అయింది. ఈ సెస్ ద్వారా బస్టాండులు, బస్‌షెల్టర్ల అభివృద్ధికి నిధులు సమకూర్చుకొని, ఈ నిధులతో ఆర్టీసీ బస్టాండులను అభివృద్ధి చేసి, వాటిని ఆదాయ ఆర్జన సాధనాలుగా మలచుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. ఇక ప్రతిపాదనల ప్రకారం... వంద కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారి మీద రూ. 1 భారం పడనుంది. వంద కిలోమీటర్లు దాటితే రూ. 2 వడ్డించనున్నారు. ఎన్ని వందల కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే... అన్ని రూపాయలు సమర్పించుకోవాల్సిందే.  తాజా వడ్డింపు ద్వారా ఏటా రూ. 350 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని సంస్థ భావిస్తుంది. మరోవైపు అన్ని రూట్లలోనూ టోల్‌ఫీజును వసూలు చేయాలని యోచిస్తోంది. జాతీయ రహదారుల పై బస్సుల పై ప్రయాణం చేద్దామనుకే వారికి మరింత భారం పడనుంది. మొత్తానికి జనవరి నుండి సామాన్యులను బాధటానికి ఆర్టీసీ సిద్ధం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheetah roaming in shamshabad
Cbi jd srisailam accident lakshmi narayana escapes unhurt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles