కర్ణాటక బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. వినోద్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని ఇంటి పై లోకాయుక్తా దాడులు చేశారు. ఈ దాడుల్లో 37 కిలోగ్రాముల వెండి, 1.9 కిలోగ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 10.9 లక్షల రూపాయలు ఉంటుందని లోకాయుక్తా తెలిపింది. అవినీతికి పాల్పడి ఈశ్వరప్ప ఆస్తులు కూడగట్టుకుంటున్నారని వినోద్ ఆరోపించారు. ఈ దాడుల సమయంలో ఈశ్వరప్ప ఇంట్లో లేరు. ఆయన పర్యటన నిమిత్తం ఉత్తర కర్ణాటకలో ఉన్నారు. ఇక ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈయన పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏం బాగా లేదు. ఇలాంటి పరిస్థితులలో ఉప ముఖ్యమంత్రి ఈ దాడులు జరగడం మరింత తలనొప్పిగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more