Tdp calls for guntur bandh over kodelas arrest

telugu desam party,kodela siva prasada rao, arrest, bandh, guntur, poll roll irregularities, co-operative bodies

tdp calls for guntur bandh over kodelas arrest

guntur bandh.gif

Posted: 12/24/2012 11:50 AM IST
Tdp calls for guntur bandh over kodelas arrest

tdp calls for guntur bandh over kodela's arrest

నర్సరావు పేటలో  మాజీ మంత్రి  కోడెల శివప్రసాదరావు  అరెస్టుకు  నిరసనగా  ఈ రోజు  గుంటూరు  జిల్లా  బంద్ కు తెలుగుదేశం పార్టీ  పిలుపునిచ్చింది.  కోడెలతో  సహా 14 మందిని  పోలీసులు  అరెస్టు చేసి సత్తెన పల్లి కోర్టులో  హాజరు పర్చారు.  14 మందికి  జనవరి  4వరకూ మేజిస్ట్రేట్  రిమాండ్  విధించారు.  అక్రమ అరెస్టు పై  ముఖ్యమంత్రిని రేపు కలవాలని  తేదేపా  శ్రేణులు  నిర్ణయించాయి.  డీఎస్సీని వెంటనే  విధుల నుంచి తొలగించాలని  ఆ పార్టీ నేతలు డిమాండ్ చేసింది.  మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ రావు  అరెస్టు కు నిరసనగా  గుంటూరు జిల్లాలో  బంద్  కొనసాగుతోంది.  గుంటూరు నగరంలో  పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.  బస్టాండ్  ప్రాంతంలో  దుకాణాలను  మూసివేయించారు.  నాదెండ్ల మండలం  అమీన్ సాహేబ్ పేట వద్ద చీరాల ప్రధాన రహదారిపై  కార్యకర్తలు  రాస్తారోకోకు దిగారు.  సహకార ఎన్నికల ఓట్ల నమోదులో అక్రమాలు తొలగించాలని  నిన్న ఆందోళనకు దిగిన కోడెల శివప్రసాద్ రావు తో పాటు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ  ఆద్వర్యంలో  ఈ బంద్ కొనసాగుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mopidevi released
Bjp leader venkaiah naidu demands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles