Minor girl raped by father brother in kerala

Minor girl raped, Rape, Kerala, Raped by father, kerala, Kannur district,raping the minor

Minor girl raped by father, brother in Kerala

girl.gif

Posted: 11/27/2012 12:37 PM IST
Minor girl raped by father brother in kerala

Minor girl raped by father, brother in Kerala

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నలతో పాటు మరో సమీప బంధువు 13 ఏళ్ల చిన్నారిపై కీచక కాండకు ఒడిగట్టారు. రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ బాలికకు నరకం చూపించారు. కేరళలో చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఉదంతం రెండు రోజుల క్రితం వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కన్నూర్ జిల్లాలోని ధర్మదామ్‌కు చెందిన బాధితురాలి వివరాలను తలసేరి సీఐ వినోద్ కుమార్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం స్కూలు వదిలిన తర్వాత రోదిస్తూ కనిపించింది. ఇంటికెళ్లడానికి నిరాకరించింది. ఎందుకేడుస్తున్నావని ఉపాధ్యాయులు అడగ్గా తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి, అన్న(15), మరో బంధువు తాను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి తనపై అత్యాచారం చేస్తున్నారని బాలిక తెలిపింది. 8వ తరగతి చదివిన తన అక్కపై కూడా వారు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghmc bulldozes unauthorised buildings
T congress mps plea to sonia on statehood issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles