Deshapati srinivas comment on leaders

Deshapati srinivas, trs Deshapati srinivas,

Deshapati srinivas comment on leaders.

Deshapati srinivas.png

Posted: 11/26/2012 04:01 PM IST
Deshapati srinivas comment on leaders

deshapati-srinivasమన రాజకీయ నాయకులు చేతలలో వెనకబడ్డ, మాటలలో మాత్రం ముందుంటారు. వారు కొన్ని పదాలకు కొత్త కొత్త అర్థాలు కనిపెడతారు. జాతీయకులు అయినా, రాష్ట్ర నాయకులు అయినా సరే తమ మాటలతో ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా, ప్రత్యర్థి నాయకులకు ఆ మాటలతో చురకలు అంటిస్తారు. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నాయకుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక ప్రముఖుడు దేశపతి శ్రీనివాస్. మంచి భాష,భావం కలిగిన దేశపతి తెలంగాణ ఉద్యమానికి అవసరమైన సాహిత్యాన్ని అందించడంలో పేరుతెచ్చుకున్నారు. నిన్న సూర్యాపేటలో జరిగిన టిఆర్ఎస్ సభలో ఆయన ప్రసంగిస్తూ, "జఫ్పా' అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ‘జఫ్పా ’ అంటే జగన్ ఫాలోయర్స్ అని ఆయన అభివర్ణించారు. జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలపై ఆయన విమర్శిలు కురిపిస్తూ, ఆమె వదిలిన బాణం కాదు, తెలంగాణ పాలిట బాణామతి, శత్రువు అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ అమరవీరుల వైపో, తెలంగాణ సంపదను కొల్లగొట్టిన జగన్ వైపో తేల్చుకోవాలని హెచ్చరించారు. ఆయన చెప్పిన మాట తెలంగాణవాదుల్లో ఉత్సాహాన్ని నింపిందంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp vijayasathi says no differences with kcr
Nagam janardhan to start telangana bharosa yatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles