Cm kiran speech on childrens day celebration

cm kiran childrens day, cm kiran speech on childrens day, childrens day celebration, childrens day, ravindra bharathi, cm kiran kumar reddy

CM Kiran speech on childrens day celebration

CM Kiran.gif

Posted: 11/15/2012 02:37 PM IST
Cm kiran speech on childrens day celebration

CM Kiran speech on childrens day celebration

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాలలకు ధైర్యం నూరిపోశారు. భయపడుతూ బతికే బతుకు... బతుకే కాదన్నారు. 'కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాకు కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ.. ఎవరికీ భయపడకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. మనమేం చే యాలో మనమే నిర్ణయించుకోవాలి. భయపడుతూ బతికే బతుకు బతుకే కాదు'' అని పిల్లలకు సూచించారు. ఎన్ని అడ్డంకులెదురైనా అనుకున్నది సాధించే వరకు పో రాడాలన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా... రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పిల్లలతో అన్నారు. "కొన్నిసార్లు కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకుని ముందుకు వెళ్లాలి'' అని సూచించారు. తెలుగుతోపాటు ఉర్దూ, ఇంగ్లీషు భాషలను నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా రాణించవచ్చన్నారు. ఈ మూడు భాషలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. పిల్లల కోసం ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. అయితే... కుటుంబ సంబంధాల గురించి తల్లిదండ్రులే పిల్లలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల కోసం ప్రభుత్వం ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని కిరణ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leader kishan reddy fires on mim
Bal thackeray stable sanjay raut  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles