Fake swami attack by local people

Fake swamiji, vijayawada, treasure, secrets, apartment, Bhaskar, Srinivas rao, financial difficulties, 5 months, 10 lakhs, liquor bottles,

Fake Swami Attack by Local people

Swami.gif

Posted: 11/12/2012 12:53 PM IST
Fake swami attack by local people

Fake Swami Attack by Local people

ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలువురి బలహీనత ఆసరా చేసుకుని డబ్బు గుంజేందుకు ఓ మాయ మాంత్రికుని వేసిన ఎత్తుగడ పారలేదు. క్షుద్రపూజలతో నడమంత్రపు సిరికి నడుచుకుంటూ ఇంటికి వస్తుందని నమ్మించి డబ్బు మాత్రం కాజేయడమే కాకుండా గత ఆరుమాసాలుగా రాజభోగాలతో సుఖ సౌక్యాలు అనుభవిస్తున్నాడు. అయితే ఇతగాడి మోసం నుంచి తేరుకున్న బాధితులు ఎట్టకేలకు అతన్ని పోలీసులకు పట్టించారు. పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నం గురుద్వారాకు చెందిన పైడిపాటి భాస్కర్ (23) అనే యువకుడు పదో తరగతి చదివాడు. అయితే చదువు, సంధ్యా, బాధ్యతలు విస్మరించి చిత్తానుసారం తిరుగుతున్న ఇతగాడికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఇంకేముంది తనకు తెలిసిన మంత్రాలతో, పూజలతో గుప్త నిధులను వెలికి తీస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఇంకేముంది విశాఖ నుంచి విజయవాడకు మకాం మార్చాడు. ఇదిలావుండగా... పటమటలంక రాఘవనగర్‌కు చెందిన పొన్నం శ్రీనివాసరావు (45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో అప్పుల నుంచి గట్టేందుకు అనేక మార్గాలు అణ్వేషిస్తున్నాడు. ఈ దశలో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా క్షుద్ర మాంత్రికుడు భాస్కర్ పరిచయమయ్యాడు.

Fake Swami Attack by Local people

ఇంకేముంది అతన్ని దర్శిపేటలోని శ్రీరామ్స్ పెరల్ విల్లా అపార్ట్‌మెంటలోని తన ప్లాట్‌లో ఉంచాడు. చల్లపల్లిలో కోట్లరూపాయలు విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని, ఇందుకోసం పూజలు చేయాలని దీంతో ఆ నిధులు హస్తగతమవుతాయని, దీంతో ఆర్థిక కష్టాలు తొలగుతాయని నమ్మించాడు. శ్రీనివాసరావు సహకారంతో అమ్మవారికి శాంతి పూజలు చేయాలని రక్తతర్పణానికి తెర తీశాడు. మేకపోతు తొడ నుంచి తీసిన రక్తంతో క్షుద్రపూజలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇందుకోసం అందినంత సొమ్ము అందిపుచ్చుకున్నాడు. శ్రీనివాసరావుతోపాటు ఇదేబాటలో శికుమార్, చిన వెంకటేశ్వరరావు, పెద వెంకటేశ్వరరావు, రెడ్డెమ్మ, ప్రసాద్, రాము అనే మరో పదిమంది వరకు సదరు మాంత్రికుడిని విశ్వసిస్తూ వచ్చారు. వారి వద్దకూడా లక్షల్లో డబ్బు తిన్నట్లు చెబుతున్నారు. అయితే ఆరు మాసాలుగా ఫలితం మాత్రం కానరాకపోవడంతో శ్రీనివాసరావు భార్య శ్రీలక్ష్మీ క్షుద్రమాంత్రికుని మోసాలను బట్టబయలు చేసింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు దర్శిపేటలోని ప్లాట్‌పై ఆదివారం దాడి చేసి మంత్రికుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. బాధితుడు శ్రీనివాసరావు భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమె మోసగానికి రెండు లక్షలు ముట్టచెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bus stop movie controversy
Hijras train robbery patna express  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles