Congress leaders medomadhanam meeting in delhi

congress party medomadhanam, congress leaders medomadhanam meeting, medomadhnam conference in delhi, congress leaders, sonia gandhi, gahul gandhi, delhi, high command, party meeting, sonia gandhi new plans,

congress leaders medomadhanam meeting in delhi

congress.gif

Posted: 11/09/2012 12:56 PM IST
Congress leaders medomadhanam meeting in delhi

congress leaders medomadhanam meeting in delhi

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి పార్టీలో పెద్ద పాత్ర.. మధ్యంతర ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అధికార పార్టీ సూరజ్‌కుంద్‌లో కీలక ‘మేధోమథనం’ నిర్వహించనుంది. ఒక్కరోజుపాటు జరగనున్న ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా పార్టీ కీలక నేతలు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నారు. సంకీర్ణ రాజకీయ పరిమితులపై పార్టీలో వ్యక్తమవుతున్న ఆందోళనపై కూడా సమాలోచనలు జరపనున్నారు. యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలిగిన అనంతరం జరుగనున్న తొలి సమీక్షా సమావేశం ఇది. వరుసగా వెలుగుచూస్తున్న అవినీతి కుంభకోణాలు, పార్టీకి రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ మథనాన్ని చేపట్టడం గమనార్హం. త్వరలోనే పార్టీలో పెద్ద పాత్ర పోషించనున్న రాహుల్‌గాంధీతోపాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సోనియాగాంధీ ప్రారంభ ప్రసంగంతో చర్చ ప్రారంభం కానుంది. ప్రస్తుత ఆర్థిక సవాళ్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతలకు సంక్షిప్తంగా వివరించనున్నారు. అనంతరం రాజకీయ సవాళ్లపై చర్చ జరుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ యూపీఏను వీడిన నేపథ్యంలో సంకీర్ణ సర్కారు మనుగడపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని సాగుతున్న ఊహాగానాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆంధ్రవూపదేశ్ వ్యవహారాలు, తెలంగాణ అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. ‘మేధోమథనం’లో ఆయన ఆర్థిక అంశాలపై చర్చ ప్రారంభించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Auto money meant for bala sai baba trust
Athena cyclone in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles