No change of cm kiran vayalar ravi

No change of CM Kira, Hot topic in AP, nine probables for state CM, CM candidate, CM KKR, CM Kiran Kumar Reddy, Next CM, PCC chief Botsa, Botsa Satyanarayana

No change of CM - Vayalar Ravi.

No change of CM Kiran_ Vayalar Ravi.png

Posted: 11/06/2012 09:44 PM IST
No change of cm kiran vayalar ravi

Raviఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి వేరే వారిని ఆ సీట్లో కూర్చేబెట్టేందుకు అధిష్టానం రెడీ అవుతుందనే వార్తలు చాలా రోజుల నుండి వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు వాయలార్ రవి స్పందిస్తూ.... 2014 వరకు  సీఎం మార్పు ఉండదని, కిరణ్‌కుమార్‌రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన మార్పు పై వస్తున్న వార్తలు అన్నీ గాలి వార్తలే అని కొట్టి పారేశారు. తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారని వాయలార్ రవి అన్నారు. అందరి అభిప్రాయాలను తాను తీసుకొని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి చేరవేస్తున్నానని చెప్పారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సోనియాగాంధీయేనని చెప్పారు. కాగా ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డి, కుందూరు జానా రెడ్డి లేదా డి.శ్రీనివాస్‌ను కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. మరి వాయలార్ రవి మాటల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles