Partys rally at ramlila maidan in new delhi on sunday

party's rally at Ramlila Maidan in New Delhi on Sunday. Lokpal Bill, Parliament session, Congress rally, Manmohan Singh, Sonia Gandhi, UPA allies, Winter session, Rajya Sabha, Lok Sabha,opposition bjp critisise central government,

party's rally at Ramlila Maidan in New Delhi on Sunday.

25.gif

Posted: 11/04/2012 06:59 PM IST
Partys rally at ramlila maidan in new delhi on sunday

1

raamleela_maidan

దేశంలో రైతులను అభివృద్ధి పథంలో నడిపించేందుకే ఎఫ్‌డీఐలను దేశంలోకి అహ్వనిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. దేశం ప్రగతి పథంలో నడవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజాసదస్సులో సోనియా మాట్లాడుతూ అవినీతిని వెలుగులోకి తీసుకరావటానికి తామే ఆర్టీఐ చట్టం తీసుకువచ్చామని..నిజాయితీలో తమతో ఎవరు పోటీ పడలేరని ఆమె పేర్కొన్నారు.
       కాగా,  అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విధానపరమైన నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ మొదటి ప్రాధాన్యత రైతులకు లబ్ధి చేకూర్చడం అని చెప్పారు. రైతుల్లో విశ్వాసం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎనిమిది కోట్ల మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎఫ్‌డీఐల రాక అవసరమని చెప్పారు. ఎఫ్‌డీఐలు ప్రతి ఒక్కరికి మేలు కలిగిస్తాయన్నారు. ఉద్యోగ కల్పనకు ఆర్థిక సంస్కరణలు అవసరమన్నారు.
    ఇక యువనేత రాహుల్ ఏమన్నారంటే.. పనిగట్టుకుని తమపై విపక్షాలు బురద జల్లుతున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవస్థ మార్పుకు విపక్షాలు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ, రాజకీయాలు చేస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది యూపీఏ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రైతులు, సామాన్యులకు మేలు చేస్తాయని తెలిపారు. సామాన్యులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని అంతమొందించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. జనాలతో రాంలీలా మైదానం కిక్కిరిసిపోయింది.
      అయితే. ఈ సదస్సు మీద విపక్షాలు పెదవివిరిసాయి.  అమెరికా లభాల కోసమే ఎఫ్‌డీఐలను స్వాగతిస్తు కాంగ్రెస్ పార్టీ ప్రజాసదస్సు నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది. ప్రజాల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ర్యాలీలతోలో బల ప్రదర్శనకు దిగుతోందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. ఎఫ్‌డీఐల వల్ల లక్షలాది మంది రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో పెరిగిన అవినీతికి సమధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎఫ్‌డీఐలని వ్యతిరేకించిన మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇప్పుడు తామే ఎఫ్‌డీఐలను ప్రవేశపెట్టడం కాంగ్రెస్ నయవంచక వైఖరికి నిదర్శనమన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajmal kasab diagnosed with dengue
Anupam kher asia best actor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles