Floods in andhra pradesh

floods in andhra pradesh, heavy raining cause floods in ap, floods trouble in andhr, floods damage crops, floods effect in andhra pradesh, trains running late in andhrapradesh, trains, floods

floods in andhra pradesh

5.gif

Posted: 11/04/2012 12:43 PM IST
Floods in andhra pradesh

ap_floods

గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయింది. అనేక జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమయింది. తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో వరదల కారణంగా హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లాల్సిన ఆరు రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రేల్వే అధికారులు తెలిపారు. కాజీపేట, బల్లార్షా, నాగపూర్ మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. హౌరా వెళ్లాల్సిన ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4 గంటలకు బయల్దేరనుంది. మరోవైపు తుని రైల్వే స్టేషన్లలోనే శనివారం అర్ధరాత్రి నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
       మరోవైపు.  భారీ వర్షాలకు విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన 21 మంది రైతులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. పొలాలకు వెళ్లిన రైతులంతా ఇళ్లకు బయలుదేరే సమయానికి.. తాచేరు నది ప్రవాహం ఒక్కసారిగా ఉధృతం కావడంతో అక్కడే ఉన్న పాకల్లో చిక్కుకుపోయారు. సెల్‌ఫోన్లతో గ్రామంలోని వారికి సమాచారం అందించారు. వారిని కాపాడేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా చీకటి పడడం, వర్షం ఎక్కువగా కురుస్తుండడంతో వెనుదిరిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ ఆర్డీవో, జడ్పీ సీఈవో వడ్డాది చేరుకుని రైతుల క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
        ఇంకా,  సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ‘నీలం’ తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paster rape attempt on child girl
Union minister chiranjeevi press meet hyd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles