Manchu family attacked brahmins

manchu family attacked brahmins, attack on brahmins, vishnu attacked on brahmins, vishnu warned brahmins, manchu family, manchu mohan babu, manchu vishnu, manchu lakshmi, manchu manoj, case on manchu family, manchu family security guards, manchu security guards attacked brahmins, security guards attacked brahmins, case on mohan babu, denikaina ready movie controversy

Manchu Family Attacked Brahmins

Mohan Babu.gif

Posted: 11/01/2012 10:19 AM IST
Manchu family attacked brahmins

Mohan Babu's House Attacked by Brahmins Protesters beaten

దేనికైనా రెడీ చిత్రంపై  బ్రాహ్మణసంఘాల నిరసన  ఉద్రిక్తతకు దారితీసింది.  ఏపీ బ్రాహ్మణ  సేవా  సంఘ  సమాఖ్య  యువజన  విభాగం అధ్యక్షుడు  ద్రోణంరాజు రవికుమార్  ఆధ్వర్యంలో కొందరు బ్రాహ్మణులు  రాత్రి 8.30 గంటలకు సినీనటుడు  మోహన్ బాబు ఇంటి ముందుకు వచ్చి చిత్రానికి వ్యతిరేకంగా  నినాధాలు చేశారు.  ఇంటి గేటు వైపు  దూసుకొచ్చే  ప్రయత్నం  చేయడంతో  మోహన్ బాబు  అనుచరులు, సెక్యూరిటీ  సిబ్బంది  వారిపై  దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో  నగరంలోని మాల్కాజ్ గిరికి  చెందిన శివరామశర్మ  దిగి ఇరు వర్గాలను  చెదరగొట్టారు.  మోహన్ బాబు  , ఆయన కుమారుడు  విష్ణు  పలుమార్లు కలిసి అభ్యర్థించినా.. వారు తమను కించపరిచే  విధంగా మాట్లాడారన్నారు. అయితే బ్రాహ్మణులు మేం ఆగ్రహిస్తే  ఎంతకైనా తెగిస్తామని  హెచ్చరించారు. తాజాగా ‘దేనికైనా రెడీ’ చిత్ర నిర్మాత మోహన్‌బాబు ఇంటి ముందు బ్రాహ్మణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.

Mohan Babu's House Attacked by Brahmins Protesters beaten

మోహన్‌బాబు ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన బ్రాహ్మణులను ఆయన అనుచరులు తరిమికొట్టారు. పోలీసుల ఎదుటే కర్రలతో కొట్టారు. బ్రాహ్మణులపై తమ అనుచరులు చేసిన దాడిని హీరో విష్ణు సమర్థించుకున్నారు. తమ ఇంటిపై దాడికి వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. మగాళ్లెవరూ ఇంటిలో లేనిసమయంలో ఇంటిపైకి రావడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ వాళ్లపై చేయివేస్తే చూస్తూ ఊరుకోవడానికి పౌరుషం లేని వాడిని కాదన్నారు. తమ సినిమాపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో చాలా పద్ధతులున్నాయని, ఇళ్లపైకి రావడం సరికాదన్నారు. ‘దేనికైనా రెడీ’లో ఎవరినీ కించే పరిచే సీన్లు లేవని పునరుద్ఘాటించారు. అభ్యంతకర సన్నివేశాలుంటే తన తండ్రే సినిమా తీయరని స్పష్టం చేశారు. బ్రాహ్మలంటే తమకు ఎంతో గౌరవమని స్పష్టం చేశారు. సినిమా విడుదలైన ఐదు రోజుల తర్వాత ఆందోళనలకు దిగడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘దేనికైనా రెడీ’ అంటూ సవాల్ విసిరారు.

Mohan Babu's House Attacked by Brahmins Protesters beaten

మరోవైపు బ్రాహ్మణులు తగ్గేదిలేదంటున్నారు. వారు దేనికైనా రె‘ఢీ’ అంట్నునారు. తమవారిపై విచక్షణారహితంగా దాడి చేసిన మోహన్‌బాబు అనుచరులను కేసు నమోదుచేయాలని బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ‘దేనికైనా రెడీ’కి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. మోహన్‌బాబుకు వ్యతిరేకంగా పూజలు చేయాలని బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. చలన చిత్రాలు వివాదాలకు కేంద్రబిందువులవడం ఈ మధ్యకాలంలో ఎక్కువయింది. అంగాంగ ప్రదర్శనలతో ‘వేడి’ పుట్టిస్తున్న ఈ కాలపు సినిమాలువివిధ వర్గాల మనోభావాలను కించపరిచే స్థాయికి దిగజారాయి. హాస్యం పేరుతో చూపిస్తున్న ‘నటన’ రోత పుట్టిస్తోంది. ఏదో ఒక వర్గాన్ని తక్కువ చేసి కామెడీ అనడం ఆనవాయితీ అయింది. సున్నితాంశాల పట్ల సినిమా రూపకర్తల బాధ్యతారహిత్యం పెరిగిపోయింది. దీంతో ప్రేక్షకులకు వినోదం పంచాల్సిన సినిమాలు వివాదాల్లో కూరుకుపోతున్నాయి. లక్ష్మణరేఖ దాటుతూ ఆగ్రహానికి గురవుతున్నాయి. వినోదం పంచాల్సిన సినిమాలు విచ్చలవిడి తనాన్ని వ్యాపింపచేస్తున్నాయి. తెలుగు భాష భ్రష్టుపట్టిపోవడానికి లేటెస్టు సినిమాలూ పుణ్యం కట్టుకున్నాయన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఆధునికత పేరుతో అశ్లీలతను తెరనిండా గుమ్మరిస్తూ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు సినిమావాళ్లు. మానవతా విలువలను గౌరవించకపోయినా ఫర్వాలేదు గానీ, చెడగొట్టకుండా ఉంటే మంచిదన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tjac leader kodandaram under house arrest
Cyclone nilam makes landfall south of chennai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles