Three bar girls allegedly gang raped in bangalore

Three bar girls, gang-raped, Bangalore city,

After the alleged gang-rape of a law school student a few days ago, another incident of alleged gang-rape has been reported in the city

Three bar girls allegedly gang-raped in Bangalore.png

Posted: 10/20/2012 12:11 PM IST
Three bar girls allegedly gang raped in bangalore

Rapeబెంగుళూరులో లా విద్యార్థి పై జరిగిన అత్యాచార సంఘటన మరచిపోక ముందే.... మరో అత్యాచారం జరిగింది. బెంగుళూరు శివార్లలో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సరఫరా చేసే  ముగ్గురు యువతుల పై ఎనమిది మంది అత్యాచారం చేసి, ఇంట్లో ఉన్న నగలతో పాటు వివిధ వస్తువులను దోచుకెళ్లారు. వీరు కెంచనాపురంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ సంఘటన అర్థ్రరాత్రి 12.30 గంటల సమయంలో జరిగింది. ఈ అమ్మాయిలకు రక్షణగా ముగ్గురు యువకులు కాపలా ఉంటున్నారు. రెండు కార్లలో వచ్చిన 8 మంది యువకులు కాలపాలాగా ఉన్న వ్యక్తుల పై దాడి చేసి, యువతులను బెదిరించి పై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రామ్‌నగర్ జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ ఘటనాస్థలానికి చేరుకుని యువతులను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. దుండగుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు. లా విద్యార్థి పై జరిగిన కొద్ది రోజులకే ఇలాంటి సంఘటన మరొకటి జరగడంతో పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బయటపడినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaggareddy fires on trs for halting cgr
Lagadapati has supported pawan kalyan cgr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles