Newsweek ends 80 year print run to go all digital in 2013

Magazines, Brown, Tina, Magazines, Newsweek, United States

Newsweek ends 80-year print run, to go all-digital in 2013

Newsweek.gif

Posted: 10/19/2012 12:00 PM IST
Newsweek ends 80 year print run to go all digital in 2013

Newsweek ends 80-year print run, to go all-digital in 2013

ఎనభై ఏళ్ల తర్వాత తమ ప్రింట్ ఎడిషన్‌కు స్వస్తి చెప్పాలని, 2013 ప్రారంభం నుంచి మొత్తం డిజిటల్ రూపంలోకి మారాలని అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’ నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా ఆ సంస్థ ఉద్యోగాల్లో కోత పడే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. వచ్చే డిసెంబర్ 31 సంచికే న్యూస్ వీక్ చివరి అమెరికా ప్రింట్ ఎడిషన్ అవుతుంది. చాలామంది వినియోగదారులు వార్తలను రిసీవ్ చేసుకోవడానికి తమ సెల్‌ఫోన్లను, టాబ్లెట్లను వాడడం పెరిగి పోతూ ఉండడంతో మీడియా సంస్థలు కూడా ఆన్‌లైన్‌కు మారడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.

న్యూస్‌వీక్ సంస్థే కాకుండా స్మార్ట్ మనీ మ్యాగజైన్ కూడా డిజిటల్ ఫార్మాట్ కోసం తమ ప్రింట్ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్లు గత జూలై నెలలో ప్రకటించింది. స్మార్ట్ మనీలో 25 ఉన్నత స్థాయి పదవులను రద్దు చేయవచ్చని అప్పుడు డౌవ్ జోన్స్ కంపెనీ తెలిపింది. ప్రింట్ ఎడిషన్‌ను మూసివేయాలని న్యూస్ వీక్ తీసుకున్న నిర్ణయం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. వారపత్రికగా తన భవిష్యత్తు గురించి సంస్థ ఆలోచిస్తోందని గత జూలైలోనే సంస్థ యజమాని అయిన బారీ డిల్లర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌కు మంచి పేరే ఉందని, అయితే ముద్రణా రూపంలో వీక్లీ న్యూస్ మ్యాగజైన్‌ను రూపొందించడం అంత సులభం కాదని అప్పుడు ఆయన అన్నారు. డైలీ బీస్ట్ వెబ్‌సైట్‌లో న్యూస్‌వీక్ డైలీ బీస్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన టినా బ్రౌన్ ఈ ప్రకటన చేసారు. ఆన్‌లైన్ పబ్లికేషన్ పేరు ‘న్యూస్‌వీక్ గ్లోబల్’గా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఒకే ఎడిషన్ ఉంటుందని, ముందస్తు చందా చెల్లింపు ద్వారా లభించే ఈ ఎడిషన్ టాబ్లెట్లకు, ఆన్‌లైన్ రీడింగ్‌కు అందుబాటులో ఉంటుందని, డైలీబీస్ట్ వెబ్‌సైట్‌లో ఉండే కొన్ని వార్తలు కూడా ఇందులో ఉంటాయని బ్రౌన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu newspaper rate
Bjp will seal borders if returned to power  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles