Hero srikanth escapes fatal accident

srikanth accident, Venkatesh Shadow,srikanth accident,Shadow telugu movie,shadow

Actor Srikanth escaped a major injury when a car chase action episode went wrong on the sets of Shadow in Malaysia

Hero Srikanth escapes fatal accident.png

Posted: 10/17/2012 04:19 PM IST
Hero srikanth escapes fatal accident

Srikanthప్రముఖ తెలుగు హీరో శ్రీకాంత్ పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే చాలా రోజుల తరువాత స్వయంగా చెప్పాడు. ఇది జరిగి దాదాపు నెల రోజులకు పైగా అయింది. ఇన్ని రోజుల తరువాత ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ విక్టరీ వెంకటేష్ నటిస్తున్న షాడో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మలేషియాలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ‘శ్రీకాంత్ తన ట్విట్టర్లో ‘మళ్లీ పుట్టాను...షాడో షూటింగులో పెద్ద యాక్సిడెంట్ నుంచి బయట పడ్డాను. జస్ట్ లో మిస్సయింది. లేకుంటే నేను ఈ లోకంలో ఉండే వాడిని కాదేమో. ఆ దేవుడి దయవల్లే బ్రతికాను' అంటూ శ్రీకాంత్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంటే శ్రీకాంత్ చెప్పిన దానిని బట్టి చూస్తుంటే... అది పెద్ద యాక్సిడెంటో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా షూటింగుల్లో ప్రమాదాలు జరగడం సహజం. కానీ ఇంత పెద్ద ప్రమాదం నుండి శ్రీకాంత్ బయటపడ్డాడంటే... ఖచ్చితంగా దేవుడి దయే అని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada hot comments on padayatra
One hour of watching tv shortens your life by 22 mins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles