Protection of women from sexual harassment

Protection, Women,Sexual, Harassment, Manmohan singh, PM,

Protection of Women from Sexual Harassment

Women.gif

Posted: 10/12/2012 12:09 PM IST
Protection of women from sexual harassment

Protection of Women from Sexual Harassment

మహిళలను అసభ్యంగా చూపేందుకు ప్రయత్నించే వారెవరైనా ఇక మరింత కాలం జైలు శిక్షకు, భారీ జరిమానాకు సిద్ధంగా ఉండాల్సిందే. అశ్లీలమైన మల్టీమీడియా సందేశాలు లేదా ఈ మెయిళ్లు పంపినా జైల్లో కూర్చోవాల్సిందే. నేరం రుజువైతే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటివరకు కనీస జరిమానా రూ.2 వేలు మాత్రమే ఉంది. ఈ మేరకు మహిళల అసభ్య చిత్రీకరణ నిరోధక చట్టాన్ని (ఐఆర్‌డబ్ల్యూఏ-1986) సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మహిళలకు సంబంధించిన ఆడియో, వీడియోలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాను కూడా చట్ట పరిధిలో చేర్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో సవరించిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానంత రం ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇంటర్నెట్, మల్టీమీడియా సందేశాల వంటి కొత్త విధానాలను సైతం చట్ట పరిధిలోకి చేర్చడం ద్వారా.. మహిళలను అసభ్యంగా చూపించకుండా వారికి మరింత రక్షణ కల్పించడమే ధ్యేయంగా సవరణలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.

సవరించిన చట్టం ప్రకారం, ఈ విధమైన నేరం రుజువైతే ఇప్పటివరకు ఉన్న జరిమానాను అలాగే గరిష్ట శిక్షాకాలాన్ని కూడా పెంచినట్లు ఆ ప్రకటన పేర్కొంది.రెండోసారి ఇదేవిధమైన నేరానికి పాల్పడితే కనీసంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇక జరిమానా కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు విధించే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీకృత అధికారులతో పాటు ఇన్‌స్పెక్టర్ ఆపై స్థాయి పోలీసు అధికారులకు ఈ చట్టం కింద సోదాలు నిర్వహించే అధికారంతో పాటు స్వాధీన పరుచుకునే అధికారం ఉంటుంది. ప్రకటనలు, ప్రచురణలు, రాతలు, చిత్రలేఖనం ద్వారా లేదా మరో విధంగా మహిళలను అసభ్యంగా చూపించడాన్ని నిరోధించే ఉద్దేశంతో ఈ చట్టానికి రూపకల్పన చేశారు. ఈ చట్ట పరిధిలో ఇప్పటివరకు కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉంది.అయితే ఏళ్లు గడిచిన కొద్దీ సాంకేతిక విప్లవ ఫలితంగా ఇంటర్నెట్, ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థ, మల్టీమీడియా సందేశాలు, కేబుల్ టెలివిజన్ వంటి సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో ఈ చట్ట పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్లు ప్రభుత్వం వివరించింది. ఇదిలావుండగా రాజస్థాన్‌లో 758 జాతీయ రహదారి నిర్మాణానికిగాను రూ.899.24 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు, 65వ జాతీయ రహదారిలోని సల్సార్-హర్యానా సరిహద్దు సెక్షన్‌ను రెండు లేన్లుగా అభివృద్ధి పరిచే రూ.600 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rmp doctor harassment on village people
I t officials raid gmr properties across india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles