Naidus letter to pm on telangana

telugu Desam Party,TDP, chief N Chandrababu Naidu, letter,Prime Minister, Manmohan Singh, last night, Telangana,issue,

Rift in TDP Over Naidu's Letter to PM on Telangana

Naidu.gif

Posted: 09/27/2012 11:18 AM IST
Naidus letter to pm on telangana

Rift in TDP Over Naidu's Letter to PM on Telangana

ఎట్టకేలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు సంబందించి వెంటనే పార్లమెంటులో తీర్మానం పెట్టాలని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు.తెలంగాణా అంశాన్ని త్వరగా తేల్చాలని చంద్రబాబు ఆ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అఖిల పక్ష సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేస్తే అందులోనే తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తామని లేఖలో తెలిపారు.  తెలంగాణ విషయంపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలను… కాంగ్రెస్ తీరును చంద్రబాబు లేఖలో స్పష్టంగా రాశారు. తాము గతంలో తెలంగాణపై ఇచ్చిన లేఖ గురించి ప్రస్తావిస్తూ ఆ లేఖను తాము వెనక్కు తీసుకోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. 2008లో ఏర్పాటు చేసిన ప్రణబ్ కమిటీకి తాము ఇచ్చిన లేఖలో పేర్కొన్న అంశాలను కూడా బాబు ఈ సందర్భంగా మరొక సారి గుర్తు చేశారు.

లేఖపై సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు అభ్యంతరం చెప్పినప్పటికీ… చంద్రబాబు ఈ లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటి వరకు టీడీపీపై నెడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ విషయంలో బాబు స్టాండ్‌ మారిందా..? రెండుకళ్ల సిద్ధాంతం అంటూ టీడీపీని కళ్లులేని కబోధిలా మార్చిన బాబు ఇంత హఠాత్తుగా తెలంగాణపై లేఖ ఇవ్వాలని నిర్ణయించు కోవడానికి కారణమేంటి..? ఇదే ఇపుడు తెలంగాణ ప్రజల మన స్సులో ముసురుకుంటున్న ఆలోచనలు..వచ్చిన తెలంగాణను అడ్డు కొన్న బాబు ఇంత హఠాత్తుగా తెలంగాణపై లేఖ ఇస్తామనడానికి కారణమేందో ఎంత ఆలోచించినా తెలంగాణ ప్రజలు అర్థం కావ డం లేదు…అసలు విషయం ఏందంటే గత ఎనిమిదేళ్లుగా అధికా రానికి దూరంగా ఉన్న ఇక ఎలాగైనా వచ్చేసారైనా అధికారంలోకి రావాలనుకొంటున్నాడు..అందుకే ఓ కార్యక్రమాన్ని నిర్వహించాల నుకొంటున్నాడు..2004లో వైయస్‌ పాదయాత్ర చేసి అధికారం లోకి వచ్చాడట…చంద్ర’బాబు’ కూడా పాదయాత్ర చేసి అధికారం లోకి వస్తాడట..అయితే ఇందులో తాజా వార్త ఏందంటే అక్టోబర్‌ 2 నుండి మొదలుపెట్లే యాత్ర అదిలాబాద్‌ నుండే షురూ చేస్త డట…అగో అందుకే తెలంగాణలో అడుగుపెడ్తే ఎక్కడ నిలదీస్తరో నని భయపడ్డడు..అందుకే లేఖ ఇస్తానంటూ ప్రకటిస్తున్నడు.. అయినా బాబుకు లేక ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడ్డది తెలం గాణలో..ఎందుకంటే లేఖ విషయంలో ఇప్పటికే ఒక సారి మోస పోయిన తెలంగాణ ప్రజలు..మరోసారి నమ్మడానికి, నమ్మిమోసపో వడానికి సిద్ధంగా లేరు..2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే తన కొంపలేవో మునిగిపోయి నట్లు చాలా తీవ్రంగా స్పందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana march and ganesh nimajjanam effect
Ncp says it is not keen on keeping deputy cm post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles