Telangana march a grand success

telangana march a grand success with some untoward incidents, telangana march, telangana march 2012, telangana bandh,telangana bandh,telangana march,telangana march 2012,headlines,homeslider

Hyderabad once again witnessed a violent clash between police and students of Osmania University from where Telangana march reiterating their demand of separate statehood began on Sunday, Sep 30.

Telangana march a grand success.png

Posted: 10/01/2012 01:26 PM IST
Telangana march a grand success

Kodandaram

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాజకీయ జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో  నిర్వహించిన తెలంగాణ మార్చ్ విజయవంతం అయింది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు ఈ మార్చ్లో పాల్గొనడం విశేషం. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ అర్థ్ర రాత్రి వరకు ఈ మార్చ్ సాగింది. ఈ మార్చ్ కి వర్షం అడ్డంకి కావడంతో  రాత్రి 11.50 గంటలకు మార్చ్ ముగిసినట్లు ప్రకటించడంతో ముందు ప్రభుత్వం, ఆ తరువాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్చ్ అడపాదడపా హింసాత్మక సంఘటనలు తప్ప , పెద్దగా ఆటంకాలు ఏమీ జరగలేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.  పోలీసులు అడుగడుగునా తలపెట్టిన ఆటంకాలను అధిగమిస్తూ పది జిల్లాల నుంచి జనం లక్షలాదిగా తరలివచ్చారు.  తెలంగాణ వాణి ఢిల్లీకి వినిపించే స్థాయిలో మార్చ్ నిర్వహించారు. లక్షలాదిగా కదిలి వచ్చిన జనంతో హుసేన్ సాగర్ జనసాగరంగా మారింది.

భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జనం పట్టుదలతోతడిసిముద్దవుతూనే నెక్లెస్ రోడ్డుపై నిలబడటం విశేషం.  తెలంగాణపై ప్రకటన వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటామని జెఎసి నేత కోదండరామిరెడ్డి స్పష్టం చేయడంతో వర్షం వచ్చినా.. తడిసిపోతూ వేదికపై నుంచి వక్తల ప్రసంగాలు వింటూ కూర్చున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి సాగరహారానికి రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించాలని సర్కార్‌ను హెచ్చరిక జారీచేశారు.  విచ్చలవిడిగా వాటర్‌కానన్లను, బాష్పవాయుగోళాలను ఉపయోగించిన పోలీసులు తెలంగాణవాదులను చెదరగొట్టి నెక్లెస్‌రోడ్ నుంచి తరిమేసే విధంగా ప్రవర్తించారు. బాష్పవాయుగోళాలతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. పోలీసుల విచ్చలవిడి బలప్రయోగంతో ఓ దశలో నేతలు కూడా వెనుకంజ వేసినా కవాతుకు హాజరైన జనంలో ఉత్సాహం, పట్టుదల చూసి నిర్ణయం మార్చుకున్నారు. తెలంగాణపై రోడ్‌మ్యాప్ ప్రకటన చేయించాలని తెలంగాణ మంత్రులను డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ncp says it is not keen on keeping deputy cm post
Bilawal bhutto loves hina wants to marry her  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles