Rupee appreciation to cap gold prices

Rupee appreciation to cap gold prices,international price,gold tend,rise,rupee,cap

Rupee appreciation to cap gold prices

gold.gif

Posted: 10/01/2012 01:18 PM IST
Rupee appreciation to cap gold prices

Rupee appreciation to cap gold prices

పసిడి అభిమానులకు శుభవార్త. ఇప్పటివరకు పసిడి పరుగులు చూసి అభిమానులు చాలా నిరాశ పోయారు. కానీ ఈసారి పసిడి అభిమానుల కోసం తన పరుగులు వేగం తగ్గించింది.  ఇక పసిడి అభిమానుల బంగారు కోరికలు చాలా ఈజీగా తీర్చుకోవచ్చు. పసిడి ప్రతి ఒక్కరికి సొంతం కాబోతున్న రోజులు వస్తున్నాయి.  పెద్దింటి వారికే పసిడి అనే మాటను చేరిపేసి.. పెదింటి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా  పసిడి ధర పడిపోతుందట. పుత్తడి పరుగుకు కళ్లెం పడనుందా? పాపాయిలా పడిపోయిన రూపాయి అంతోఇంతో బలపడుతుండడంతో బంగారం దిగిరాక తప్పదా? అంతర్జాతీయ మార్కెట్‌లో సెంటిమెంట్‌ సానుకూలంగా ఉన్నా.. దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కేంద్రం తీసుకుంటున్న సంస్కరణలు బంగారంపై ప్రభావం చూపనున్నాయి. డీజిల్ ధరల పెంపు, రిటైల్‌, విమానయానంలో ఎఫ్‌డిఐలకు అనుమతించిన నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్రమంగా పెరుగుతోంది.

Rupee appreciation to cap gold prices

ఈ ప్రభావం బంగారం ధరలపై ఉంటుందని.. స్వల్ప కాలానికి పది గ్రాములు 30 వేల రూపాయలకు తగ్గొచ్చని నిపుణులు లెక్కలేస్తున్నారు.ఈమధ్యే ఆల్‌టైం హైని తాకిన పుత్తడి ప్రస్తుతం 31 వేల రూపాయల పైన సెటిలైంది. ఇది కాస్త 30 వేల దరిదాపుల్లోకి రావొచ్చని అంచనా. దేశీయంగా ఇలా ఉంటే.. అంతర్జాతీయంగా బంగారం ధరల విషయంలో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. 1770 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ ధర డిసెంబర్ నాటికి 19 వందల డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, టర్కీ, దక్షిణ కొరియా, రష్యా వంటి దేశాలు స్వర్ణాన్ని కొనుగోళ్లు చేస్తుండడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushma swaraj as pm candidate
Pm may address nation monday on coal scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles