అదృష్టం సుడి ఉంటే చాలు .. సూనామీ రూపంలో కూడా డబ్బులు వస్తాయాని ఒక వ్యక్తి నిరూపించారు. అదృష్టం అనేది .. ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం అనేది .. తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం తలుపు తీసే వరకు అదృష్టం అతని చూట్టు తిరుగుతునే ఉంది. లాటరీ టిక్కెట్ కొన్నాడు. కానీ నంబర్లు సరిగా చూసుకోలేదు. లాటరీ టికెట్ నంబర్ తప్పుగా చూసుకుని.. రూ.122 కోట్లు తగిలిన టికెట్‌ను పక్కకు పారేశాడు న్యూజిలాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు. అయితే, అతడి టైం బాగుంది కాబట్టి.. అదృష్టం.. మిస్సయి.. మళ్లీ వచ్చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. న్యూజిలాండ్‌కు చెందిన ఓ యువకుడు ఈ మధ్య జుత్తు క త్తిరించుకుందామని సెలూన్‌కు వెళ్లాడు. అది బంద్ చేసి ఉంది. ఏమనుకున్నాడో ఏమో.. ఆ డబ్బుతో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. రిజల్ట్స్ రోజు వచ్చేసింది. ఫలితాలను మొబైల్ ఫోన్లో చెక్ చేసుకున్నాడు. అయితే, తప్పుడు ఫలితాలు చూసుకోవడంతో నంబర్ కనిపించలేదు. దీంతో చీ.. పనికిరాని టికెట్ అంటూ.. దాన్ని పక్కన పడేసి.. పనిలోకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఊరంతా గగ్గోలు.. రూ.122 కోట్ల లాటరీని ప్రకటించినా.. ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరూ రాలేదని.. ఎందుకో అతడికి డౌటొచ్చింది. టికెట్ కోసం ఇళ్లంతా వెతికాడు. మిస్సయిన అదృష్టం మళ్లీ దొరికింది. అతడిని ఒకే రోజులో కోటీశ్వరుడిని చేసింది. ఈ రూ.122 కోట్ల ప్రైజులో భాగంగా.. నగదుతోపాటు ఖరీదైన కార్లు, స్పీడ్ బోట్, ఇల్లు వంటివన్నీ ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more