మొబైల్ మాటలతో.. మనిషి యొక్క బంధాల దూరం పెరుగుతుందని అంటున్నారు. సెల్ ఫోన్ వల్ల ప్రతి ఇద్దరి వ్యక్తుల మద్య దూరం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన మాటలను సుదూర తీరాలకు మోసుకేళ్లే సెల్ ఫోన్ల వల్ల సంబంధాలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక సెల్ ను గదిలో పెట్టి .. మన బందువులతో మాటడుతున్నప్పుడు ఆ ప్రభావం చాలా ఎక్కువుగా ఉంటుందని విశ్వవిధ్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మొబైల్ ఉండటం వలన ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధభాందవ్యాల్లో వచ్చే తేడాలను వారు గుర్తించినట్లు చెబుతున్నారు. దీని పై వారు రెండు ప్రయోగాలను చేశారట. మొదటి ప్రయోగం ఒక ప్రైవేటు బూత్ లలో వాలంటీర్లను జంటలుగా కూర్చోబెట్టి... వారికి కనిపించేలా ఒక పుస్తకం పెట్టారు.
దీనికి తోడుగా కొన్ని బూత్ లలో నోట్ పుస్తకాలు, మిగతవాటిలో సెల్ ఫోన్లు పెట్టారు. ఆ తర్వాత అసక్తికరమైన ఒక వ్యక్తిగత అంశం గురించి రెండో వ్యక్తికి వివరించాలని పరిశోధకులు కోరారు. అయితే వారు 10 నిమిషాలే మాట్లాడుకున్నా.. సెల్ ఫోన్ ఉనికి పెను ప్రభావం చూపినట్లు వెల్లడైంది. సెల్ ఫోన్ కళ్లెదుట ఉన్న వాలంటీర్లు.. తమ భాగస్వామితో మాటామంతీ అంత నాణ్యంగా సాగలేదని చెప్పారు. రెండో ప్రయోగంలో ..పరిచయం లేని వ్యక్తులను జంటలుగా చేసి, వారిని పిచ్చాపాటిగా మాట్లాడుకోవాలని సూచించారు. ఇందులో కూడా సెల్ ఫోన్ ఎదురుగా ఉన్నప్పుడు అనుబంధంలో నాణ్యత తగ్గినట్లు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more