ఉపాధ్యాయుల్లేక అల్లాడిపోయే విద్యార్థుల్ని చూశాం.. కానీ నాలుగేళ్ల పాటు విద్యార్థుల్లేకపోయినా కొనసాగిన పాఠశాలను చూశారా.. అయితే మనం వేలూరు జిల్లా షోళింగర్ సమీపంలోని కమ్మపాలెం వెళ్లాల్సిందే. ఆ స్కూలు క్లీనర్ దయతలచి తన ఇద్దరు పిల్లల్ని చేర్చబట్టి ఇప్పటికైనా ఇద్దరు విద్యార్థులు మిగిలారు గానీ, లేకుంటే ఇప్పటికీ అక్కడ విద్యార్థులు 'నిల్లు'గానే వుండేవారు. పాఠశాల తీసేస్తే ట్రాన్స్‌ఫర్ వస్తుందన్న భయంతో ఆ మహిళా క్లీనర్ పెద్ద మనసు వుంచబట్టి సరిపోయింది, లేకుంటే పరిస్థితెలా వుండేదో?.. విషయం తెలుసుకోవడానికి ఆ ఊరెళ్తాం రండి!జంబుకుళం పంచాయతీ పరిధిలో వున్న కమ్మపాలెంలో ప్రభుత్వ ప్రాథమి క పాఠశాల వుంది. ఈ పాఠశాలలో 1వ నుంచి 5వ తరగతి వరకు చదువుకునేందుకు ఇద్దరే విద్యార్థులున్నారు.
వీరిలో ఒకరు 4వ తరగతి కాగా, మరొకరు ఐదో తరగతి. 1961వ సంవత్సరంలో 75 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల.. 2006 విద్యాసంవత్సరం నుంచి 2010 విద్యా సంవత్సరం వరకు ఒక్క విద్యార్థి కూడా లేకుండా సాగిపోయింది. ఆ 4 సంవత్సరాల పాటు ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది పాఠశాలకు వెళ్లి అక్కడి పరిసరాలు శుభ్రం చేసి, తలుపులు తెరచి కూర్చొనేవారు. ఆ తరువాత వచ్చే ప్రధానోపాధ్యాయురాలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చొని గోడలతో కబుర్లు చెప్పి ఎంచక్కా వెళ్లిపోయేవారు. అయితే 2010లో మాత్రం ఇద్దరు పిల్లలు చేరారు. ప్రస్తుతం వారితోనే పాఠశాల నడుస్తోంది. అయితే ఆ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకమంటే ఏంటో తెలియదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more