టాయిలెట్ సీటుపై కన్నా ఎక్కువగా మీ సెల్‌ఫోన్‌పై సూక్ష్మక్రిములు ఉన్నాయంటే మీరు నమ్మలేక పోతున్నారా ? కాని ఇది నిజం. పరిశోధకులు దీన్ని సాక్ష్యాలతో సహా రుజువుచేశారు. అరిజోనా యూని వర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ తాజా అధ్యయనంలో సెల్‌ఫోన్లపై ఆవాసం ఏర్పరుచుకున్న సూక్ష్మక్రిములు టాయిలెట్ సీటుపై ఉన్న క్రిములతో పోలిస్తే10 రెట్లు ఎక్కువగా ఉన్నాయని వారు గుర్తిం చారు. వీటి మూలంగా శ్వాసకోస, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఫోన్లను ఒకరి చేతినుంచి మరొకరి చేతిలోకి మారుతూంటే ఈ క్రిముల సంఖ్య పెరుగుటతోపాటు వ్యాధులు కూడా పెరుగుతాయని వారు వెల్లడించారు. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మైక్రోబయోలజిస్ట్ చార్లెస్ జెర్బా వివరాలను తెలుపుతూ.. సెల్‌ఫోన్‌ను నోటీకి దగ్గరగా పెట్టుకొని మాట్లాడం మూలాన వ్యాధులు సంక్రమిస్తున్నట్లు తేల్చారు. ఈ ఎలక్ట్రానిక్ సాధనాలను శుభ్రం చేయవీలులేకున్నప్పటికి కొన్ని నెలలకు ఒకసారైనా, ఆంటి బ్యాక్టీరియా కలిగిన పదార్థాలతో శుభ్రం చేస్తే సూక్ష్మ క్రిముల సంఖ్యను తగ్గించే వీలుందని ఆయన అన్నారు.
సెల్‌ఫోన్ లను తుడవటం వంటివి చేయకపోవటం మూలాన వాటిపై బాక్టీరియా తదితర సూక్ష్మ క్రిముల సంతతి విస్తరిస్తుందని తెలిపారు. గతంలో కూడా పరిశోధకులు ఏటీఎం మెచైన్లు, కంప్యూటర్ కీబోర్డులు, టీవీ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు చెందిన రిమోట్ కంట్రోళ్లపై కూడా బాక్టీరియా, ఈ కోలీ, కోలిఫర్మ్, స్టెఫిలోకోకస్ అరెయుస్, ఎంటరో బ్యాక్టీరియా, బాసిల్లియస్ వంటి సూక్ష్మ క్రిములున్నాయని గుర్తించారు. ఇవి మనిషికి డయోరియా, తదితర అనారోగ్యాలను కలిగిస్తాయని వారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more