23gif

23.gif

Posted: 08/26/2012 01:55 PM IST
23gif

       తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా కనుమూరి బాపిరాజు మరోసారి నియమితులయ్యారు. నిన్నటితో పాలకమండలి bapi_eeపదవీకాలం ముగియడంతో.. బాపిరాజు నేతృత్వంలో 14 మందితో కూడిన నూతనపాలకమండలిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాలకమండలి సభ్యులుగా ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, పాముల రాజేశ్వరి, కె. కమలతో పాటు.. శివప్రసాద్, కన్నయ్య, రఘునాథ్, విశ్వనాథ్ రావు దేశ్ పాండే, లక్ష్మణరావు, చిత్తూరు రవీంద్ర, శ్రీనాథ్ రెడ్డి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ కమిషనర్, ఈవోలను నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/87 ప్రకారం టీటీడీ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. bapi_e
     అయితే 2011 ఆగస్టులో కనుమూరిని ఛైర్మన్ గా నియమిస్తూ ఇచ్చిన జీవోలో బాపిరాజుకు ఏడాది మాత్రమే పదవిని కేటాయించారు. దీంతో కనుమూరి తనకు మరోమారు అవకాశం ఇవ్వాలంటూ అధిష్ఠానం వద్ద మొరపెట్టుకున్నారు. అటు ఛైర్మన్ పదవి కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ జరిగిందనే ప్రచారం ఉంది. ఎంపిలు కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశిరావు, టి. సుబ్బిరామిరెడ్డిలతో పాటు.. మాజీ ఛైర్మన్ ఆదికేశవులునాయుడూ పైరవీలు సాగించారు. అయితే తనకు రెండేళ్ల పదవీకాలం ఇవ్వనందున మరోసారి అవకాశం ఇవ్వాలన్న కనుమూరి అభ్యర్థనకే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఆయననే మరోసారి కొనసాగించాలంటూ ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదేశాలూ జారీ చేసింది. దీంతో కనుమూరి పదవీకాలాన్ని రాష్ట్రప్రభుత్వం పొడిగించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leaders meet cm kiran
Tdp mahadharna in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles