Award for actress manju bhargavi

award for actress manju bhargavi

award for actress manju bhargavi

3.gif

Posted: 08/19/2012 01:41 PM IST
Award for actress manju bhargavi

       తాజాగా ప్రముఖ నర్తకి, సినీనటి మంజు భార్గవి తన ప్రతిభకు మెచ్చుకోలు లభించింది. భార్గవి కి కూచిపూడి  నృత్య గురువు, manju_bhargaviదివంగత వెంపటి చినసత్యం పేరుమీద నెలకొల్పిన ప్రథమ జాతీయ అవార్డును ప్రథానం చేయనున్నట్లు వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు వంశీరామరాజు, ఉపాధ్యక్షులు కె. ధర్మారావులు తెలిపారు. వంశీ ఇంటర్నేషనల్- టి సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్, రఘునాథ్ కిడాంబి ఫౌండేషన్ సంస్థలు ఈ అవార్డును సంయుక్తంగా అందజేస్తున్నాయి. ఈనెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ అవార్డును అందించనున్నారు. ఈ కార్యక్రమానికి జ్ఞానపీఠ పురస్కారగ్రహీత డా. సి. నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, తెలుగుయూనివర్శిటీ వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే అమెరికాలో కూచిపూడి నత్యానికి సేవలందిస్తున్న శశికళాపెనుమర్తికి ప్రవాస భారతీయ అవార్డును బహూకరిస్తున్నట్లు వారు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheating in the name of cm brother
New rule for train passengers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles