Nasa gives curiosity mars rover its first major software update

NASA gives Curiosity Mars rover its first major software update

NASA gives Curiosity Mars rover its first major software update

Curiosity.gif

Posted: 08/14/2012 03:50 PM IST
Nasa gives curiosity mars rover its first major software update

NASA gives Curiosity Mars rover its first major software update

 అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణకు పంపిన క్యూరియాసిటీ వ్యోమనౌకకు శాస్త్రవేత్తలు ‘మెదడు మార్పిడి’ చేశారు! పనితీరును మెరుగు పరిచి, అడ్డంకులను అధిగమించే శక్తినిచ్చేందుకు దాని ప్రధాన కంప్యూటర్లలో కొత్త వెర్షన్ సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచారు. మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఈ సాఫ్ట్‌వేర్‌ను భూమి నుంచే క్యూరియాసిటీ మెమరీకి అప్‌లోడ్ చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ ప్రకటనలో తె లిపింది. ఈ నెల 10 నుంచి 13 వరకు సాఫ్ట్‌వేర్ మార్పిడిని పూర్తిచేసినట్లు వెల్లడించింది.

కొత్త సాఫ్ట్‌వేర్ సాయంతో క్యూరియాసిటీ తన పటిష్టమైన రోబో చేయిని మరింత సమర్థంగా ఉపయోగించగలదని, ప్రమాదాలను అధిగమిస్తూ ముందుకు ప్రయాణి ంచగలదని పాసెడెనాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఇంజనీర్ బెన్ చిచీ పేర్కొన్నారు. క్యూరియాసిటీ సాఫ్ట్‌వేర్‌ను వివిధ దశల్లో అప్‌గ్రేడ్ చేసే విధంగా ప్రాజెక్టును తొలి దశలోనే డిజైన్ చేసినట్లు తెలిపారు. రోవర్‌లో ప్రస్తుతమున్న సాఫ్ట్‌వేర్ దాని ల్యాండింగ్‌కు సంబంధించినదని, కొత్త సాఫ్ట్‌వేర్ అంగారకుడి ఉపరితల ఆపరేషన్స్‌కు సంబంధించినదని వివరించారు. కొత్త సాఫ్ట్‌వేర్ సాయంతో రోవర్.. తన ముందున్న అడ్డంకులను ఫొటోల ద్వారా పసిగట్టి, వాటిని అధిగమిస్తూ, మరింత స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నారు. రోవర్ సుదీర్ఘ ఆపరేషన్లు చేసేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ దోహదపడుతుంద న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Olympic athletics american women smash world record to win relay gold
Cm opens octopus office building in city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles