The end of the builder the giant 3d printer that could create a house in 24 hours

The end of the builder? The giant 3D printer that could create a HOUSE in 24 hours,house,Contour Crafting,3D printer

The end of the builder? The giant 3D printer that could create a HOUSE in 24 hours

3D.gif

Posted: 08/14/2012 11:52 AM IST
The end of the builder the giant 3d printer that could create a house in 24 hours

The end of the builder? The giant 3D printer that could create a HOUSE in 24 hours

 'ఇల్లు కట్టి చూడు' అన్న పెద్దల మాట వినే ఉంటారు. స్టీలు, సిమెంట్, ఇటుక, ఇతర సామగ్రితో పాటు డిజైన్, బిల్డర్, కూలీలు.. ఒకటేమిటి అదొక మహాయజ్ఞం. వీటికి తోడు ఆర్థిక సర్దుబాట్లు, తలనొప్పులు, నెలల తరబడి సమయం అన్నింటినీ భరిస్తేనే అందమైన ఇల్లు సాకారమవుతుంది. అయితే, ఓ అమెరికన్ నిపుణుడు తాను కనిపెట్టిన కొత్త టెక్నాలజీతో 'ఇల్లు కట్టడం ఇంత సులువా?' అనిపిస్తున్నారు. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఒకే ఒక్క రోజులో నివాస భవనాన్ని నిర్మిస్తున్నారాయన! 'కాంటూర్ క్రాఫ్టింగ్'గా ప్రస్తుతం విస్తృతంగా ప్రచారమవుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని సుసాధ్యం చేశారు. ఆయనే దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బెహ్రోక్ ఖోష్నెవిస్. కాంటూర్ క్రాఫ్టింగ్‌లో భాగంగా కంప్యూటర్‌తో అనుసంధానమైన భారీ క్రేన్‌ను వినియోగిస్తారు.

 ఇళ్లు డిజైన్ ప్రకారం కంప్యూటర్ ఆదేశాలకు అనుగుణంగా ఇల్లు కట్టాల్సిన చోట క్రేన్‌కు ఉండే పరికరం మొదట ప్లాస్టిక్ అచ్చును త్రీడీ ప్రింటింగ్ చేస్తుంది. వెంటనే దానిపై మరో పరికరం కాంక్రీట్‌ను పొరను ఏర్పాటు చేస్తుంది. ఇలా అంచెలంచెలుగా(లేయర్లు) గోడల నిర్మాణం పూర్తవుతుంది. శ్లాబ్‌తో పాటు ఇతర ఫిట్టింగ్స్, మలుపులు, గదుల్లో ఎలక్రి ్టకల్, ప్లంబింగ్ పనులు, ఇతర డిజైన్లు కూడా ఒకేసారి పూర్తవుతాయి. ఈ విధానంలో నిర్మాణమయ్యే ఇళ్లు.. సాధారణ ఇంటి కంటే అందంగా, ద్రుఢంగా ఉంటాయట! పైగా 2500చదరపుటడుగుల ఇంటి నిర్మాణాన్ని 20గంటల్లోనే పూర్తవుతుందని బెహ్రోక్ చెబుతున్నారు. ఈ పద్ధతిలో బిల్డింగ్ మెటీరియల్ వ్యర్థాలు నామమాత్రంగా ఉండటంతోపాటు ఖర్చు కూడా చాలా తగ్గుతుందని చెప్పారు. అంతేనా, దీంతో అంగారకుడు, చంద్రునిపైనా సులభంగా ఇళ్లు, పరిశోధనశాలలు కట్టవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంటూర్ క్రాఫ్టింగ్ ప్రక్రియపై ఆయన కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brain works overtime to let us regain sense of smell after cold
Strong earthquake rocks russia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles