Anna hazare contest in delhi assembly elections

anna hazare contest in delhi assembly elections

anna hazare contest in delhi assembly elections

19.gif

Posted: 08/12/2012 03:57 PM IST
Anna hazare contest in delhi assembly elections

       మొత్తానికి గాంధేయవాది అన్నా హజారే రాజకీయ రణరంగంలో తేల్చుకోవటానికి సిద్దమవుతున్నారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీం అన్నా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కార్యకర్తలు ఢిల్లీ annaఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నా హజారేకు సూచించారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని 70 నియోజకవర్గాల్లో కార్యకర్తలు పనిచేయాలని అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం చివర్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో, వచ్చే ఏడాది కర్నాటకలో జరిగే ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పటిష్టమైన లోకపాల్ బిల్లును తీసుకు రావడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీపైనే ముఖ్యంగా టార్గెట్ చేయాలని అన్నా బృందం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నా ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vilas rao deshmukh health condition
Four childredn dead today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles