Pakistani man held for forcing hindu girl to marry him

Pakistani man held for forcing Hindu girl to marry him, conversion, Sarwar Solangi, Sindh High Court, Tandojam

Pakistani man held for forcing Hindu girl to marry him

Pakistani.gif

Posted: 08/09/2012 12:20 PM IST
Pakistani man held for forcing hindu girl to marry him

Pakistani man held for forcing Hindu girl to marry him

ఒక రోజు కాదు .. 30 రోజులు  హిందు యువతిన గదిలో బందించి ..అత్యాచారం  చేశాడు. అదీ కూడా  పాకిస్తాన్ లోనే జరిగింది.  హిందూ యువతిని అపహరించి పెళ్లికి బలవంతపెట్టిన కేసులో పాక్‌లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. ముందు మతం మార్పించి ఆ తరువాత యువతిని పెళ్లాడినట్టు సర్వార్ సోలంగీ చేసిన వాదన.. బాధితురాలి గోడు ముందు వీగిపోయింది. నెలరోజులుగా తనపై అత్యాచారం చేస్తూ పెళ్లికి ఒత్తిడి చేస్తున్నాడంటూ హైదరాబాద్ హైకోర్టు బెంచ్‌ను ఆమె ఆశ్రయించింది. అయితే, ఆమె ఇష్ట ప్రకారమే గత మే నెల 25వ తేదీన సోలంగీని పెళ్లాడినట్టు ఆయన తరఫు న్యాయవాది వాదించారు. సోలంగీ కూడా హిందువేనని ఇటీవలే ఆయన మతం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. మే 20న కరాచీలో ఆమె మతం మార్చుకున్నదనేందుకు అన్నీ ఆధారాలు ఉన్నాయని వివరించారు. పెళ్లి ఇష్టం లేని బంధువులు తెచ్చిన ఒత్తిడికి గురయి, సోరంగీపై అత్యాచారయత్నం ఆరోపణలు చేస్తున్నదని ఆరోపించారు. ఈ వాదనను బాధితురాలు సమర్థంగా తిప్పికొట్టింది. గత మే నెల 18వ తేదీన సోలంగీ తనను ఎత్తుకుపోయి కరాచీలోని ఒక గదిలో బంధించి అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి, బలవంతంగా మతం మార్పించాడని చెప్పింది. ఆ తర్వాత తనను నిర్బంధించి పెళ్లి చేసుకున్నాడని, ఎలాగో తప్పించుకొని కుటుంబ సభ్యుల దగ్గరకు చేరానని పేర్కొంది. సోలంగీని అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seetha nagamani mother died
Somireddy asks kcr to withdraw remarks on telugu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles