Panic incident in srikakulam district prove

panic incident in srikakulam district prove

panic incident in srikakulam district prove

9.gif

Posted: 07/30/2012 04:20 PM IST
Panic incident in srikakulam district prove

      శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన కీచకపర్వం ఘటనలో ఓ నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతబొమ్మాళి మండలం భావనపాడులోని సముద్రతీరాన్ని చూసేందుకు వచ్చిన ప్రేమజంటపై ఇద్దరు యువకులు వికృతచేష్టలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆకతాయిలు యువకుణ్ణి చెట్టుకు కట్టేయడంతో పాటు.. యువతిని వివస్త్ర చేసి కెమెరాలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆకతాయిల చెర నుంచి బయటపడిన యువతి స్థానిక గ్రామంలోకి పరుగులు తీయడంతో అక్కడి మహిళలు చేరదీశారు. దీంతో.. నిందితులిద్దరూ పరారయ్యారు. అనంతరం గ్రామస్థులు చెట్టుకు కట్టేసి ఉన్న యువకుడితో పాటు.. బాధితురాలిని క్షేమంగా వారి గ్రామానికి పంపించారు. sr
          దారుణానికి ఒడిగట్టిన నిందితులను కొమరాడ రవి, దుర్వాసులుగా గ్రామస్థులు గుర్తించారు. పారిపోయిన రవిని పట్టుకుని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించారు. అటు గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రామానికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన నిందితులపై.. భావనపాడు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకులిద్దర్నీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియకపోవడంతో.. పోలీసులు స్థానికుల స్టేట్ మెంట్స్  ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb rites on currept officials
Trs leader harishrao on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles