Economic offences court declares minister k parthasarathy

economic-offences-court-declares-minister- k-parthasarathy-

economic-offences-court-declares-minister-k-parthasarathy-`

Economic offences court declares excise minister K Parthasarathy.png

Posted: 07/25/2012 04:56 PM IST
Economic offences court declares minister k parthasarathy

parthasarathyవిద్యాశాఖ మంత్రి పార్థసారథి  .పి.ఆర్. టెలీ మీడియా ప్రొడక్ట్స్ అనే సంస్థకు పార్థసారథి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 1994 లో కొన్ని వ్యవస్థాపక సౌకర్యాలకు సంబంధించిన పరికరాల కొనుగోలులో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆర్థిక నేరాల కోర్టు నేడు నిర్థారించింది.  ఫెరా చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్టు గతంలో ఆరోపణలు రావడంతో అప్పట్లోనే ఆయనకు ఆర్థిక నేరాల కోర్టు మూడు లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.  అయితే రోజులు గడిచిపోయాయి గాని పార్థసారథి మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించలేదు. ఈ అంశాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు విషయంలో తీర్పు వెలువరించే సమయంలోనూ పార్థసారథి కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఇటీవల మంత్రికి నాన్ బెయిలబుల్ అరెస్టు జారీ చేసింది. అయితే మంత్రి ఆ అరెస్టు వారంటును రీకాల్ చేయించుకున్నారు.

తాము ప్రజా సంబంధమైన పనులలో ఉండడం, సకాలంలో సమాచారం లేకపోవడం, ప్రజల మధ్య ఉండిపోవడంవంటి కారణాలవల్ల కోర్టుకు రాలేకపోయానే గాని కోర్టును ధిక్కరించాలనే ఉద్దేశం లేదని వివరించడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారంటును రీకాల్ చేసింది. బుధవారంనాడు ఈ కేసుపై విచారణ జరిగింది. మంత్రి ఉల్లంఘనలకు పాల్పడిన విషయాన్ని కోర్టు నిర్ధారించడంతో మంత్రి చిక్కుల్లోపడ్డారు.. మంత్రి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran kumar reddy promises relief to power starved industry in andhra pradesh
Who signalled the powerplay  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles