Ex babu files criminal case against tg venkatesh

Ex-babu files criminal case against TG Venkatesh,TG Venkatesh,Ex-babu,Criminal case

Ex-babu files criminal case against TG Venkatesh

Venkatesh.gif

Posted: 07/21/2012 12:17 PM IST
Ex babu files criminal case against tg venkatesh

Ex-babu files criminal case against TG Venkatesh

మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ రిటైర్డ్ అధికారి బియ్యాల వెంకట పాపారావు కోరారు. ఆయన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పని చేయని ఐఏఎస్‌లను రోడ్డుపై కాల్చిపారేయాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలు భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదాలు తెచ్చిపెడతాయని పాపారావు ఆందోళన వ్యక్తం చేశారు.పాపారావు అసోం హోం సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు జాతీయ సంస్థలో ఆరేళ్లు పనిచేశారు. వరంగల్ జిల్లా వాస్తవ్యులైన ఆయన ప్రస్తుతం మేడ్చల్ మండలంలో అత్వెల్లి గ్రామంలో నివాసముంటున్నారు. 'పనిచేయని-తప్పుచేసిన అధికారులను శిక్షించడానికి న్యాయపరమైన మార్గాలెన్నో ఉన్నాయి. మంత్రి పొరపాటుగా వ్యాఖ్యలు చేసినట్టుగా తొలుత భావించాను. కానీ రెండు రోజుల తరువాత కూడా ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది' అని పాపారావు వివరించారు. రోడ్డుపై చెత్తకాగితాలను ఏరుకునేవారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం 189, 124ఎ, 107, 115, 530, 511 సెక్షన్‌ల ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును పరిశీలిస్తామని సీఐ రాంరెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jagruthi leader kavitha
Tea can help fight terror attack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles