Chiru cabinet minister post conform

Chiranjeevi, Chiranjeevi merged his Praja Rajyam with the Congress, Chiranjeevi to become Cabinet Ministed, Chiranjeevi met Congress President Sonia Gandhi

Chiranjeevi merged his Praja Rajyam with the congress and it is heard that he might soon be elected as a Union Cabinet Minister

Chiru Cabinet Minister post Conform.gif

Posted: 07/12/2012 06:15 PM IST
Chiru cabinet minister post conform

Chiru‘‘సేవే లక్ష్యం – ప్రేమే మార్గం’’ అంటూ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ పార్టీ పెట్టి, తరువాత కాంగ్రెస్ పార్టీలో కలిసి ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుత ప్రధాన మంత్రి కేబినెట్లో ఎట్టకేలకు బెర్తు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత మన్మోహన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో చిరంజీవికి పదవిని కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ లో తల పండిన నాయకుడు, ఆర్థిక మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ తన పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన శాఖ ఖాళీగా ఉంది.  అంతే కాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తన పదవిని పోగొట్టుకున్న హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి నిర్వహించిన ఉక్కుశాఖ మంత్రి సీటు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రధాని తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మరిన్ని శాఖలు కూడా ఆయన వద్దే ఉంచుకున్నారు. ఈనెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఈ ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలను ఆయన భర్తీ చేయనున్నారు. ఇందులోభాగంగా.. చిరంజీవికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. అయితే, ఆయన వీరభద్రా సింగ్ నిర్వహించిన ఉక్కు శాఖా లేదా కేంద్ర పర్యాటక శాఖల్లో ఒకదాన్ని చిరంజీవికి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. అలాగే, ఆర్థిక శాఖను మాత్రం చిదంబరానికి కేటాయించవచ్చని తెలుస్తోంది. అయితే, ఆయనకు కేటాయించాల్సిన శాఖపైనే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. మన్మోహన్ సింగ్ తర్జనభర్జనలు పడుతున్నట్టు సమాచారం. మరి చిరంజీవికి ఏ పదవి దక్కుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No fly list man stranded in bahrain returns to us
Two serving judges arrested in cash for bail scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles