Ysr jayanthi congress high command s crooked politics

YSR Jayanthi – Congress High Command’s Crooked Politics, Congress party leaders, YSR , Bosta ,

YSR Jayanthi – Congress High Command’s Crooked Politics

YSR.gif

Posted: 07/07/2012 12:28 PM IST
Ysr jayanthi congress high command s crooked politics

YSR Jayanthi – Congress High Command’s Crooked Politics

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి చేయాలా?వద్దా అన్నదానిపై కాంగ్రెస్ లో మల్లగుల్లాలు పడుతున్నారు. గత రెండేళ్లు ఏదో రూపంలో రాజశేఖరరెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ పరంగాను , ప్రభుత్వపరంగాను నిర్వహించారు. కాని ఇప్పుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వం, ప్రభుత్వ పధకాల వారసత్వం ఆయన కుమారుడు జగన్ కు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు వెళ్లిపోయిందన్న అబిప్రాయం ఉంది. పైగా ఇటీవలికాలంలో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో వై.ఎస్.పై కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు కురిపించారు.అలాగే సిబిఐ వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కూడా నిందితుడిగానే పరిగణిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా రాజశేఖరరెడ్డిని గుర్తించి ఘనంగా జయంతి జరపాలా? లేక తూతూ మంత్రంగా చేయాలా అన్నదానిపై అటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగాని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టతకు రాలేకపోతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వై.ఎస్.చిత్రపటానికి పూలమాల వేసి సరిపెట్టే అవకాశమే కనిపిస్తోంది.దీనిపై కిరణ్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని అంటున్నారు. అంటే ఈ సారి రాజశేఖరరెడ్డి జయంతిని సీరియస్ గా తీసుకోకపోవచ్చు. కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మాత్రం వైఎస్. జయంతిని ఘనంగానే చేయడానికి సన్నద్దమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pc may head gom on telecom spectrum
Hyderabad municipal commissioner krishna babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles